Pawan Kalyan సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ టైటిల్ లీక్.. అందరికి నచ్చిందే సెట్ చేస్తున్నారుగా..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో ఒక సినిమా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదాయ సీతం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు పై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవుతుంది అని చిత్ర యూనిట్ అయితే ఎంతో నమ్మకంతో ఉంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పవన్ ఫ్యాన్స్ కు ఎంతో ఇష్టమైన టైటిల్ను ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలలోకి వెళితే..

అలా సెట్ చేసిన త్రివిక్రమ్
తమిళంలో ఘనవిజయాన్ని అందుకున్న వినోదయ సీతం కథను తెలుగులో ఎవరు రీమేక్ చేస్తారు అనే విషయంపై చాలా రోజులు చర్చలు కొనసాగాయి. మొత్తానికి త్రివిక్రమ్ ఆ సినిమా కథను పవన్ కళ్యాణ్ కు సిద్ధం చేశాడు. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండడం విశేషం.

మొదట నెగిటివ్ టాక్
మొదట ఈ రీమేక్ సినిమా చేయవద్దు అని పవన్ ఫ్యాన్స్ నుంచి చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ రీమేక్ సినిమాలు చేస్తారు అని ఒక ఒరిజినల్ కథతో సినిమా చేయాలి అని డిమాండ్ వచ్చింది. కానీ తప్పకుండా ఇది ఫ్యాన్స్ అందరికీ నచ్చుతుంది అనే విధంగా త్రివిక్రమ్ కథలో చాలా మార్పులు చేసి మరి ఫైనల్ చేయడం జరిగింది. ఆయనే ఈ సినిమాకు మాటలు కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో మళ్లీ ఒక్కసారిగా ఈ ప్రాజెక్టు పై పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

షూటింగ్ అప్డేట్
ఇక ఈ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక దేవుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇదివరకే గోపాల గోపాల సినిమాలో దేవుడి పాత్రలో కనిపించిన పవన్ మరోసారి అదే తరహాలో ప్రయోగం చేస్తున్నాడు. ఇక ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అనే ఫాన్స్ అయితే ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఇటీవల లాంచ్ చేశారు. అలాగే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. ఈ సినిమాను జూన్ లేదా జూలైలో పూర్తిచేసే అవకాశం ఉంది.

విడుదల అప్పుడే?
ఇక సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారో అనే విషయంలో కూడా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆగస్టు లో ఫినిష్ చేయాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం కేవలం 30 రోజుల కాల్షీట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ్ పాత్ర ఎక్కువ కాబట్టి ముందుగా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన సన్నివేశాలు తోనే షూటింగ్ మొదలు అయింది.

టైటిల్ ఫిక్స్ చేసినట్లే..
ఇక వినోదయ సీతం రీమేక్ కథకు తెలుగులో ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశారనే విషయంలో కూడా ప్రస్తుతం ఒక టాక్ అయితే వైరల్ గా మారింది. ఈ సినిమాకు 'దేవర' అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాన్స్ చాలావరకు పవన్ కళ్యాణ్ ను దేవర పిలుచుకుంటారు. ముఖ్యంగా బండ్ల గణేష్ ఈ పేరును బాగా వైరల్ చేశాడు. కాబట్టి మార్కెట్లో ఈ సినిమా కరెక్ట్ గా ఉపయోగపడుతుంది అని అదే ఫైనల్ చేయాలని అనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











