మహేష్ బాబు తండ్రి చనిపోతే అలా నవ్వుతాడా? వైఎస్ జగన్‌పై పవన్ కల్యాణ్ సెటైర్లు

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రారంభించిన రెండో విడుత వారాహి విజయ యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంకు చేరుకొన్నది. తాడేపల్లిగూడెం వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మరోసారి ఏపీ ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

జనసైనికులు ఎక్కడ ఉంటే ఉత్తేజం, ఉత్సాహం, ధైర్యం కలుగుతాయి. తన యాత్రకు భారీ ఏర్పాట్లు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తాడేపల్లిగూడెంలోని ప్రముఖ నటుడు, స్వర్గీయ ఎస్వీ రంగారావు విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై విమర్శలు సంధించారు.

Pawan Kalyan satires on YS Jagan Mohan Reddy at Varahi Vijaya Yatra at Tadepallygudem Meeting

స్వర్గీయ ఎస్వీ రంగారావు విగ్రహం ఎదురుగా మీటింగ్ జరగడం చాలా ఆనందంగా ఉంది. సహజ నటుడు, హావభావాలతో సమూలంగా అందర్నీ ఆకట్టుకొన్న నటుడు ఎస్వీ రంగారావు. యంగ్ మెన్ హ్యాపీ క్లబ్‌ నుంచి వచ్చిన ఆయన నటుడిగా తనకంటూ గొప్ప ఇమేజ్‌ను సొంతం చేసుకొన్నాడు. ఆ క్లబ్‌కు వందేళ్లకుపైగా చరిత్ర ఉందని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అలాంటి అకాడమీ నుంచి వచ్చిన స్వర్గీయ రంగారావుకు పాధాభివందనాలు తెలియజేసుకొంటున్నాను అని అన్నారు.

మహేష్ బాబు తండ్రి కృష్ణ చనిపోతే నేను వెళ్లి పరామర్శించి వచ్చాను. ఆ తర్వాత వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెళ్లి.. నాన్న చనిపోయాడా? అంటూ నవ్వుతూ పలకరించాడు. ఆయన ముఖాన ఏ పరిస్థితుల్లోనైనా ఒకటే నవ్వు అంటూ పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

Pawan Kalyan satires on YS Jagan Mohan Reddy at Varahi Vijaya Yatra at Tadepallygudem Meeting

తాడేపల్లిగూడెం సభలో వాలంటీర్లపై గత మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. వాలింటర్ల జీవితాలను నాశనం చేయడం నా ఉద్దేశం కాదు. మీకు 5 వేల రూపాయల జీతం ఇవ్వడం సరికాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి పథకం కింద రోజు వారి కూలీతో పోల్చుకొంటే చాలా తక్కువ. రోజుకు వాలింటర్లకు 160 రూపాయలే ఇస్తున్నారు. మీ జీతం భూమ్ భూమ్ కంటే తక్కువ. ఏపీ విస్కీకి ఎక్కువ అంటూ విమర్శలు చేశారు.

ఇదిలా ఉండగా, పవన్ కల్యాణ్ నటించిన బ్రో ది అవతార్ సినిమా జూలై 28వ తేదీన రిలీజ్ కానున్నది. ఈ చిత్రం తమిళంలో విడుదలై విజయం సాధించిన వినోదయ సీతం సినిమా ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ కూడా కీలక పాత్రలో నటించారు. నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X