పవన్ కళ్యాణ్ అభిమానులకి బ్యాడ్ న్యూస్.. ఆ సినిమాలు ఆగిపోయినట్లే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ సినిమా మరికొన్ని రోజులు వాయిదా పడే అవకాశం ఉంది. అజ్ఞాతవాసి తరువాత చాలా గ్యాప్ తీసుకున్న పవన్ మొత్తానికి ఏదో ఒక సినిమాతో రాబోతున్నాడు అనుకుంటే ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్ కి బ్రేకులు పడటంతో పవన్ తెరపై కనిపించేందుకు మరీంత ఆలస్యం అయ్యేలా ఉంది.

Recommended Video

Pawan Kalyan's Vakeel Saab Work From Home For Dubbing Works
సామాజిక సేవలో..

సామాజిక సేవలో..

కరోనా సమయంలో పవన్ కూడా గృహ నిర్బంధంలో ఉంటూ సోషల్ మీడియా ద్వారా తనవంతు కృషిగా ప్రజలకు ఉపయోగపడే పనులను చేస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అందరికంటే ముందుగా ఆర్థిక సహాయాన్ని అంధించిన హీరో పవన్ కళ్యాణ్. రెండు రాష్ట్రాలకు కాకుండా కేంద్రానికి కూడా అందరికంటే ఎక్కువ ఆర్థిక సహాయాన్ని అందించాడు.

పవన్ బాటలో..

పవన్ బాటలో..

పవన్ కళ్యాణ్ 2కోట్లు ఇచ్చిన తరువాత మిగతా స్టార్ హీరోలు కూడా ఒకరి వెంట ఒకరు ఆర్థిక సహాయాన్ని అంధించడం స్టార్ట్ చేశారు. ఇక ఆంద్రప్రదేశ్ లో జిల్లాల వారిగా జనసేన నాయకులు పేద ప్రజలకు సహాయాన్ని అందించేందుకు ముందుకు వస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు స్థానిక పార్టీ కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు.

ఆ సినిమాలతో బిజీ బిజీ..

ఆ సినిమాలతో బిజీ బిజీ..

పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో రూపొందుతున్న వకీల్ సాబ్ రానుండగా.. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిస్టారికల్ సినిమా రిలీజ్ కానుంది. ఇక మూడవ సినిమాను గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇంకా మరో రెండు సినిమాలకు పవన్ పెండింగ్ లిస్ట్ లో పెట్టాడు.

ఆ సినిమాలు మాత్రమే..

ఆ సినిమాలు మాత్రమే..

వచ్చే రెండేళ్ల వరకు పవన్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే సినిమాలు చేయాలని అనుకున్నాడు. కానీ ఇప్పుడు చేతిలో ఉన్న మూడు సినిమాలు మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యాడు. లాక్ డౌన్ పై ఇప్పట్లో క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. దీంతో అడ్వాన్స్ తీసుకున్న సినిమాలను మాత్రమే పూర్తి చేయాలని పవన్ ఫిక్స్ అయ్యాడు. భవిష్యత్ లో ఏపీ రాజకీయాలపై మరీంత దృష్టి పెట్టాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు. అందుకే ఇక మరో సినిమాకు ఒప్పుకోకూడదని ఫిక్స్ అయ్యాడు.

బ్యాడ్ న్యూస్..

బ్యాడ్ న్యూస్..

పవన్ చేతిలో ఉన్న సినిమాలతో పాటు మరో మూడు సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకున్నాడు. వచ్చే మూడేళ్ళ వరకు ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉండాలని అనుకున్నాడు. జెర్సీ దర్శకుడు గౌతమ్, కాటమారాయుడు దర్శకుడు డాలీ అలాగే మరొక ప్రముఖ దర్శకుడితో పవన్ డిస్కర్షన్స్ జరిపాడట. ఇక ఇక ఇప్పుడు కరోనా కారణంగా సమయం వృధా అవ్వడమే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా పెను మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి పవన్ సినిమాలను దూరం పెట్టె అవకాశం ఉంది. ఒక విధంగా అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X