Pawan Kalyan ఒక్క రోజు సంపాదన ఎంతంటే.. ఆ సినిమాకి 30 రోజులకు సాలీడ్ రెమ్యునరేషన్?

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక మార్కెట్ ఉన్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాప్ లిస్ట్ లో ఉంటారు అనే చెప్పాలి. సాధారణంగా అగ్రహీరోలు సినిమాలు చేస్తే డైరెక్టర్స్ కాంబినేషన్ వలన ఒక రేంజ్ లో హైప్ ఐతే క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ నటిస్తే చాలు ఆ సినిమాకు కేవలం ఆయన నుంచి మాత్రమే భారీ స్థాయిలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి. త్వరలో పవన్ కళ్యాణ్ చేయబోయే ఒక సినిమాకు 30 రోజుల షెడ్యూల్ మాత్రమే కేటాయించారట. ఇక ఆ సినిమాకు మొత్తంగా పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో పారితోషికాన్ని అందుకోబోతున్నారు అనే వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ హీరో

బాక్సాఫీస్ హీరో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటాయి అని చెప్పవచ్చు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ఒకే తరహాలో మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్న పవన్ కళ్యాణ్ పారితోషికం విషయంలో కూడా మిగతా హీరోలు చాలా ఈజీగానే డామినేట్ చేస్తూ వస్తున్నాడు.

అందుకే పవన్ తో సినిమాలు

అందుకే పవన్ తో సినిమాలు

సాధారణంగా ఒక హీరో వరుసగా రెండు మూడు సినిమాలతో అపజయాలు ఎదుర్కొంటే ఆ తర్వాత వచ్చే సినిమా పై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. అంతే కాకుండా పారితోషికం కూడా తగ్గుతుంది. కానీ పవన్ కళ్యాణ్ కెరీర్లో మాత్రం అలాంటి పరిణామం ఎప్పుడూ చోటుచేసుకోలేదు. అతని ప్రతి సినిమా కూడా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటున్నాయి. అందుకే పవన్ తో కరెక్ట్ సినిమా తీస్తే తప్పకుండా భారీస్థాయిలో కలెక్షన్స్ అందుకోవచ్చు అని నిర్మాతలు ఆయనతో సినిమా తీయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఆ సినిమాను పూర్తి చేయాలని..

ఆ సినిమాను పూర్తి చేయాలని..

ఇక ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నప్పటికి కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అలాగే మరొక వైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలతో కూడా బిజీ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

30 రోజుల్లో పవన్ రీమేక్

30 రోజుల్లో పవన్ రీమేక్

అయితే ఇటీవల త్రివిక్రమ్ సలహా మేరకు పవన్ కళ్యాణ్ మరొక తమిళ రీమేక్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు టాక్ వచ్చింది. సముద్రఖని దర్శకత్వంలో తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న వినోదయసీతం అనే సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వచ్చింది. ఈ రీమేక్ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 ఈ రోజుల్లో పాల్గొనే విధంగా ఒక షెడ్యూలు కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.

ఒక్క రోజుకు ఎంతంటే?

ఒక్క రోజుకు ఎంతంటే?

త్వరలోనే మొదలు కాబోయే ఈ సినిమా షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ దాదాపు 60 కోట్ల వరకు పారితోషికం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అంటే ఒక్క రోజుకు ఆయన పారితోషికం రెండు కోట్ల వరకు ఉంటుంది అని చెప్పవచ్చు. సాధారణంగా ఈ రోజుల్లో అగ్ర హీరోలు అందరూ కూడా ఒక సినిమా కోసం ఏళ్ల తరబడి కష్టపడుతూ 70 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క నెలలోనే 60 కోట్లు అందుకుంటున్నాడు అంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X