చిరంజీవి తమ్ముడైనా, కుమారుడైనా .. చివరికి నా కొడుకైనా.. పవన్ కల్యాణ్ ఎమోషనల్
ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాకు ఏఎం జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో జూలై 24న విడుదల కానున్న హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి అద్భుతమైన సెట్‌లను, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ ఓ వైపు.. మరో వైపు బిజినెస్ వ్యవహారాలు చకచకా జరిగిపోతున్నాయి. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం పదవి హోదాలో పవన్ కల్యాణ్ సినిమా మీడియా ప్రెస్ మీట్‌కు హాజరయ్యారు. హరిహరవీరమల్లు సినిమా మీడియా ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ..

రాజకీయాల్లోను, ఇతర రంగాల్లోను కుల, మత, ప్రాంతీయ, ఇతర విభేదాలు ఉంటాయి. కానీ ఒక సినిమా రంగంలోనే ఎలాంటి విభేదాలు, వివక్ష ఉండవు. కేవలం టాలెంట్ మీదనే ప్రతీ ఒక్కరి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఇక చిరంజీవి తమ్ముడైనా, కొడుకువి కావొచ్చు. అల్లుడైనా, బంధువైనా.. అయి ఉండవచ్చు. చివరికి నా కొడుకైనా టాలెంట్ ఉంటేనే నిలబడుతాడు. ప్రతిభ ఉంటేనే ఇక్కడ మనుగడ ఉంటుందనే విధంగా పవన్ కల్యాణ్ మాట్లాడారు.
రాజకీయాల్లో ఉండటం వల్ల అనేక విమర్శలు వస్తాయి. పాలిటిక్స్‌లో ఉండి సినిమాల్లో నటిస్తున్నారని తిడుతుంటారు. అందుకే దూరంగా ఉంటాను. సినిమా పరిశ్రమ నాకు అన్నం పెట్టింది. కానీ నాకు సినిమా అంటే ప్రాణ వాయువు. స్టోరీ టెల్లింగ్ అనేది చాలా ఇష్టం. సినిమా అంటే నాకు ఆసక్తి, గౌరవం. సినిమా ప్రత్యేకించి.. ప్రతికూల పరిస్థితుల మధ్య రూపొందింది. అందుకే ఈ సినిమాను ముందుకు తీసుకుపోవాలని నిర్ణయించుకొన్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
సినిమా రంగంలో ఇతర హీరోలతో పోల్చుకొంటే.. నేను చాలా తక్కువే. వాళ్ల సినిమాలకు జరిగినంత బిజినెస్ నా సినిమాలకు జరగదు. వారికి మూవీస్‌కు వచ్చినంత ఓపెనింగ్స్ నా సినిమాలకు రావు. నేను ఎప్పుడూ బాక్సాఫీస్ నెంబర్ల మీద ఫోకస్ పెట్టలేదు. నా దృష్టి అంతా సమాజ సేవ, ప్రజలు, పొలిటికల్‌గా ఆలోచించాను. నేను చిత్ర పరిశ్రమలో ఉండే హీరోల్లో నేను ఒకరిని మాత్రమే. ఏఎం రత్నం లాంటి నిర్మాత బతికి ఉండాలని ఉద్దేశంతో ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉండాలని నిర్ణయించుకొన్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
సినిమా బాగుంటే ఒకరు మాట్లాడనక్కర్లేదు. సినిమా బాగలేకపోతే మాట్లాడటం అవసరం లేదు. కానీ ఈ సినిమా గురించి మాట్లాడాలని అనుకొన్నాను. ఎందుకంటే నిర్మాతలు కనుమరుగైపోతుంటే.. బలమైన సినిమా తీసి ఒడిదుడుకులకు తట్టుకోలేక బలైపోవద్దు. అందుకే ఏఎం రత్నంకు అండగా నిలబడి ఉండాలని నిర్ణయించుకొన్నాను అని పవన్ కల్యాణ్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు.


Click it and Unblock the Notifications











