ప్రభుత్వాల వల్లే ఆయన మరణం.. దేహాన్ని వదిలినా ఆత్మ ఇక్కడే.. పవన్ కల్యాణ్ ఉద్వేగం

పర్యావరణం, ప్రకృతిని పరిరక్షించాలనే తపనపడే జీడీ అగర్వాల్ ప్రథమ వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్వేగంగా ప్రసంగించారు. పర్యావరణ పరీరక్షణ కోసం తపన పడే మహనీయుడిని కోల్పోవడం జాతీ చేసుకొన్న దురదృష్టం అని ప్రసంగంలో పేర్కొన్నారు. హరిద్వార్‌లోని పవన్ సదన్ ఆశ్రమంలో జరిగిన జీడీ అగర్వాల్ సంస్మరణ సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ గంగ పరీరక్షణకు పాటుపడుతానని హామీ ఇచ్చారు. ఇంకా పవన్ ప్రసంగంలో ఏం చెప్పారంటే..

గంగా ప్రక్షాళన కోసం..

గంగా ప్రక్షాళన కోసం..

గంగను స్వేచ్ఛగా ప్రవహించాలని, కాలుష్యం బారిన పడకుండా నియంత్రించాలని ప్రొఫెసర్ జీడీ అగర్వాల్ సాగించిన పోరాటం గురించి నాకు తెలుసు. ఆయన సాగించే ఉద్యమం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకొనే వాడిని. గంగ ప్రక్షాళన కోసం నిరాహార దీక్షకు దిగితే.. ఆయన ఆత్మత్యాగం చేయకుండా ప్రభుత్వం స్పందిస్తుందని భావించాను. దురదృష్టం కొద్ది ఏ ప్రభుత్వం ఆయన పోరాటాన్ని పట్టించుకోలేదు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

జీడీ అగర్వాల్ మరణాంతరం

జీడీ అగర్వాల్ మరణాంతరం

జీడీ అగర్వాల్ మరణాంతరం గంగ ప్రక్షాళనకు కోసం ప్రస్తుత ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ జీడీ అగర్వాల్ ఆత్మత్యాగాన్ని ఆపలేకపోయింది. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. దేశం తన ఆత్మను కోల్పోయిందనేంతగా బాధపడ్డాను. అగర్వాల్ మృతితో దేశవ్యాప్తంగా తిరుగుబాటు వస్తుందని అనుకొన్నాను. కనీసం ఉత్తరప్రదేశ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విస్మయానికి గురిచేసింది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

గంగానదిని పరీరక్షించుకోవడం

గంగానదిని పరీరక్షించుకోవడం

గంగానది ఉత్తర భారతానికి చెందినది కాదు.. దేశం మొత్తానికి సంబంధించింది. పర్యావరణం కోసం ఆత్మత్యాగం చేసిన జీడీ అగర్వాల్ స్ఫూర్తితో గంగను పరీరక్షించుకోవడం తన ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాను. అగర్వాల్ లాంటి మహాత్ముడి ఆశయ సాధనకు అండగా నిలుస్తాను. ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా గంగా ప్రక్షాళనకు ఉద్యమిస్తాం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

శరీరాన్ని నడిపించే ఆత్మ

శరీరాన్ని నడిపించే ఆత్మ

శరీరాన్ని నడిపించే ఆత్మ అత్యంత శక్తిమంతమైనది. ప్రొఫెసర్ అగర్వాల్ తన దేహాన్ని వదిలి ఆత్మను ఇక్కడే వదిలి మరింత శక్తిమంతంగా తయారయ్యారు. ఆయన శక్తే నన్ను ఇక్కడికి వచ్చేలా మేల్కొలిపింది. అగర్వాల్ సందేశాన్ని దేశం మొత్తానికి అందించేందుకు నా వంతు బాధ్యతను తప్పనిసరిగా నిర్వర్తిస్తాను. ఆయన ప్రాణత్యాగాన్ని వృధాకానివ్వం అని పవన్ కల్యాణ్ అన్నారు.

111 రోజులు నిరాహారదీక్షతో

111 రోజులు నిరాహారదీక్షతో

గంగా ప్రక్షాళన కోసం 111 రోజులపాటు నిరహారా దీక్ష చేసి ప్రాణత్యాగానికి పాల్పడిన జీడీ అగర్వాల్ గొప్ప మేధావి. ఐఐటీలో విద్యాభ్యాసంతోపాటు ఉన్నత విద్యకు గొప్పగా కృషి చేసిన జాని. చివరిదశలో సన్యాసాన్ని స్వీకరించిన విషయాన్ని పవన్ ఈ సందర్బంగా గుర్తు చేసుకొన్నారు. ఈ సమావేశంలో రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, వాటర మ్యాన్ రాజేంద్ర సింగ్, ప్రొఫెసర్ విక్రమ్ సోని, జనసేన పోలిట్ బ్యూరో సభ్యులు యూసఫ్ అర్హం ఖాన్, బొలిశెట్టి సత్య, బస్వరాజ్ పాటిల్, రమేశ్ శర్మ, మిశ్రా తదితర నాయకులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X