పవన్ కల్యాణ్ తో ఆ సెన్సేషనల్ డైరెక్టర్ సినిమా ఆగిపోలేదా? ఎప్పుడు స్టార్ట్ అంటే?

తెలుగు సినిమా పవర్ స్టార్ అలాగే ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇపుడు ఎలాంటి పాన్ ఇండియా సినిమాలు చేయకపోయినా కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలిచారు. స్టేట్ నేషనల్ పాలిటిక్స్ లో కూడా కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన సినిమాలకి మాత్రం దూరంగానే ఉన్నారు. ఏ సినిమాలు మొదలు పెట్టకుండా ఉంటే ఏమో కానీ ఆల్రెడీ మూడు సినిమాలు సెట్స్ మీదకి వెళ్లి ఇప్పుడు అలా పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి.

కాగా ఈ చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో ఓజి, హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అలాగే దర్శకుడు జ్యోతి కృష్ణతో హరిహర వీరమల్లు అనే సినిమాలు లైన్ లో ఉన్నాయి. దీనితో ఈ సినిమాల కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాల తర్వాత పవన్ సినిమాలకి దాదాపు స్వస్తి చెప్పేసినట్టే అని అంతా అనుకుంటున్నారు కానీ ఈ మూడు సినిమాలు కాకుండా పవన్ నాలుగో సినిమా కూడా చేయనున్నారని చాలా మంది మర్చిపోయినట్టు ఉన్నారు.

pawan kalyan star director movie is not shelved here is latest update

కాగా పవన్ తో ఏ దర్శకుడు మాత్రం సినిమా చేయడానికి ముందుకు రారు? అలానే పవన్ తో సినిమా ఓకే చేసుకొని ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న స్టార్ దర్శకుడు సురేందర్ రెడ్డి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో "ధృవ", మెగాస్టార్ చిరంజీవితో "సైరా" నరసింహా రెడ్డి లాంటి సెన్సేషనల్ హిట్స్ చేసిన ఈ దర్శకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది.

కాగా ఈ సినిమా ఎప్పుడో అనౌన్స్ కూడా చేశారు కానీ ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ భీంలా నాయక్, బ్రో అని రెండు కంప్లీట్ చేయడం ఇవీ కాకుండా ఓజి, వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు స్టార్ట్ చేసేసరికి సురేందర్ రెడ్డితో సినిమా ఆగిపోయింది అనే చాలా మంది అనుకున్నారు. కానీ ఇపుడు అసలు ట్విస్ట్ ఏమిటంటే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోలేదట.

pawan kalyan star director movie is not shelved here is latest update

పవన్ కోసం సురేందర్ రెడ్డి ప్లాన్ చేసిన మాఫియా జానర్ సినిమా వెరీ మచ్ గా ఆన్ లో ఉందని ఇప్పుడు సినీ వర్గాల్లో తాజాగా వచ్చిన అప్డేట్. దీనితో వీరిద్దరి నడుమ సినిమా ఆగిపోలేదు తెరకెక్కనుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమాకి సురేందర్ రెడ్డి కథ అంతా ఎప్పుడో సిద్ధం చేసుకోగా హైదరాబాద్ నేపథ్యంలోనే సినిమా ఉంటుంది అని తెలుస్తుంది.

pawan kalyan star director movie is not shelved here is latest update

అలాగే ఈ చిత్రాన్ని ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ముందు మూడు సినిమాలకే ఇంకా పవన్ ఎప్పుడు సమయం కేటాయిస్తున్నారు అనేది ఇంకా తెలియరాలేదు మరి ఈ నాలుగో సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఎపుడు పూర్తవుతుందో ఆ శివయ్యకే తెలియాలి. ప్రస్తుతం అయితే పవన్ ఓజి షూట్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్.

More from Filmibeat

Read more about: pawan kalyan surender reddy
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X