OG Story: ఓజీ మూవీ స్టోరీలైన్ లీక్.. అన్ని సంవత్సరాలు వెనక్కి.. పవన్ సినిమాలో హైలైట్ అవే
సుదీర్ఘ విరామం తీసుకున్న తర్వాత సినిమాల్లోకి కమ్‌బ్యాక్ అయినప్పటి నుంచి ఏకధాటిగా మూవీలు చేస్తూ ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోన్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలీవుడ్‌లో ఉన్న మరే స్టార్ హీరో చేయని విధంగా ఒకేసారి మూడు నాలుగు ప్రాజెక్టులను చేస్తోన్న అతడు.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోన్నాడు. అలా పవన్ కల్యాణ్ ఇప్పుడు నటిస్తోన్న చిత్రాల్లో 'OG' ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన స్టోరీలైన్ తాజాగా బయటకు వచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!
వరుసగా నాలుగు మూవీలు: ఈ మధ్య కాలంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోన్నాడు. అందులో క్రిష్ జాగర్లమూడితో 'హరిహర వీరమల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సముద్రఖనితో 'బ్రో' వంటి సినిమాలు చేస్తోన్నాడు. వీటితో పాటు సుజిత్ దర్శకత్వంలో 'OG' అనే సినిమాలో కూడా పవన్ కల్యాణ్ నటిస్తోన్న విషయం తెలిసిందే.

గ్యాంగ్‌స్టర్‌గా పవన్ సందడి: పవన్ కల్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) సినిమాను RRR ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. అలాగే, ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రవి కే చంద్రన్ పని చేస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా చేస్తోంది. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారని అంటున్నారు.
ఫుల్ స్పీడ్.. షూట్ అక్కడే: హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను ముంబై నగరంలో కొద్ది రోజుల క్రితమే మొదలు పెట్టారు. అక్కడ పవన్ కల్యాణ్ సహా కొందరు సినీ ప్రముఖుల కాంబినేషన్‌లో కీలకమైన సీన్స్‌ను షూట్ చేశారు. అలాగే, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా కంప్లీట్ చేసుకున్నారు. అవన్నీ అద్భుతంగా వచ్చినట్లు తెలిసింది.

ఆ టార్గెట్.. రిలీజ్ అప్పుడే: పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబోలో వస్తున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీని క్రిస్మస్ కానుకగా మూడు రోజుల ముందుగానే అంటే డిసెంబర్ 22వ తేదీన గ్రాండ్‌గా విడుదల చేయనున్నారని తెలిసింది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ షూటింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారట. దీన్ని ఎలాగైనా అక్టోబర్ నాటికి పూర్తి చేసేందుకు టార్గెట్ పెట్టుకున్నారని ఫిలిం నగర్ సమాచారం.
ఓజీ మూవీ స్టోరీలైన్ అదే: సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడని తెలిసినప్పటి నుంచే 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే దీని నుంచి ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా 1950 నాటి బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుందని తాజాగా రివీల్ అయింది. ఇది ముంబై నేపథ్యంతోనే సాగుతుందని అంటున్నారు.

గ్యాంగ్‌స్టర్‌గా.. హైలైట్‌గా: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీలో పవన్ 70 ఏళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నాడట. అంతేకాదు, ఇందులో అతడు కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కూడా చేస్తాడని తెలిసింది. ముఖ్యంగా ఈ చిత్రంలోని యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉండబోతున్నాయట. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోతూనే ఉన్నాయి.


Click it and Unblock the Notifications











