Ustaad Bhagat Singh: పని పూర్తి చేసిన పవన్ కల్యాణ్.. పాలిటిక్స్‌లో హీటు పెంచేలా ప్లాన్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక ఉప్పెన. అంతలా అతడు సుదీర్ఘ కాలంగా సినిమాల్లో హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు. ఫలితంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటు మార్కెట్‌ను కూడా ఏర్పరచుకుని దూసుకుపోతోన్నాడు. దీంతో మరింత ఉత్సాహంగా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.
రీఎంట్రీలో యమ జోష్‌లో ఉన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు చాలా సినిమాలు చేస్తున్నాడు. అందులో స్టైలిష్ డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కిస్తోన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ఒకటి. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే ప్రారంభించారు. ఆ వెంటనే వరుసగా కొన్ని షెడ్యూళ్లను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఇలా దాదాపు 30- 40 శాతం వరకూ టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు. అంతలోనే పవన్ కల్యాణ్ డేట్స్ లేకపోవడంతో చిత్రీకరణను నిలిపేశారు. దీంతో హరీశ్ మరో మూవీని మొదలెట్టాడు.
పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కలిసి చేస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ అసలు ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మూవీ నుంచి స్పెషల్ ట్రీట్ రాబోతుందని చిత్ర యూనిట్ శనివారం ప్రకటించింది. కానీ, అదేంటి అనేది మాత్రం వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో తాజాగా దీనిపై మరో క్రేజీ అప్‌డేట్‌ను వదిలింది.
'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ నుంచి మార్చి 19న ట్రీట్ రాబోతుందని చిత్ర యూనిట్ తాజాగా వెల్లడించింది. అంతేకాదు, పవన్ కల్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను కూడా షేర్ చేసింది. తద్వారా గ్లింప్స్ పవర్ స్టార్ డైలాగ్‌తో రాబోతుందని అర్థం అయింది. ఇక, ఈ వీడియోలో పవన్ పొలిటికల్ డైలాగ్ పాలిటిక్స్‌లో హీటు పెంచేలా ఉంటుందని ముందే చెప్పిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది 'తేరీ' మూవీకి రీమేక్‌గా రూపొందుతోంది. ఇందులో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











