twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మిమ్మల్ని నమ్మించడమంటే నాకు చిరాకు... అభిమానికి పవన్ కళ్యాణ్ రిప్లై!

    |

    సినిమా రంగాన్ని, కోట్ల సంపాదనను వదిలేసి 'జనసేన' పార్టీ స్థాపించి రాజకీయాల్లో ప్రవేశించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల విద్యార్థులతో భేటీ అయిన పవన్ కళ్యాణ్‌కు అభిమాని నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మీరు జనసేన పార్టీ పెట్టారు. మీకంటే ముందు ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ్ గారు ఏదో మార్పు తెద్దామని వస్తే తొక్కేశారు. ప్రేమే లక్ష్యం సేవా మార్గం అని చిరంజీవిగారు ఓ పార్టీ పెట్టారు. ఆయన్ను కూడా తొక్కేశారు. మీరేమో 25 సంవత్సరాల్లో మంచి భవిష్యత్ ఇస్తాను, నా మీద నమ్మకం పెట్టుకోండి అని చెబుతున్నారు. మిమ్మల్ని ఎలా నమ్మాలి? అంటూ ఓ అభిమాని ప్రశ్నించారు.

    అభిమాని ప్రశ్నకు పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు...

    నేను నా ఇష్టంతో వచ్చాను

    నేను నా ఇష్టంతో వచ్చాను

    విలువలతో కూడిన రాజకీయాలు చేస్తామని చెప్పి వచ్చిన జేపీ గారిని తొక్కేశారు, చిరంజీవిగారిని తొక్కేశారు. ఇపుడు మీరొచ్చారు... మీరు నిలబడతారు అనే గ్యారంటీ ఏమిటీ అని ప్రశ్నించే వారికి నేను చెప్పేది ఒక్కటే. నాకు ఎవరో అండగా నిలబడతారని రాలేదు. మీరేదో నాకు చేస్తారని రాలేదు. నేను నా ఇష్టంతో వచ్చాను. నాకు దేశం అంటే ప్రేమ.

    నేను మాంఝీ లాంటోడిని

    నేను మాంఝీ లాంటోడిని

    మీలో ఎంత మంది ఓట్లు వేస్తారో తెలియదు. ఎంత మంది నా వైపు నిలబడతారో తెలియదు. నేను అందరిలా కూర్చుని కథలు చెప్పను. సలహాలు ఇవ్వను. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతాను. మాంఝీ అనే వ్యక్తి తన ఊరికి వెళ్లడానికి దారి లేదని, చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఒక చిన్నపాటి కొండను చెక్కి దారి ఏర్పాటు చేసుకోవడానికి ఒక 20 సంవత్సరాలు సమయం తీసుకుంటాడు. అతడు ఎవరి సహాయం తీసుకోలేదు. నేను కూడా మంఝీ లాంటోడిని.

    నమ్మించడం అంటే చిరాకు

    నమ్మించడం అంటే చిరాకు

    సహాయ పడటానికి వస్తే చేసుకుంటూ వెళ్లిపోతాను. నన్ను చూసి ఎవరైనా స్పూర్తి పొంది వస్తే సంతోషం. అంతే కానీ ఎవరినీ నమ్మించడానికి నేను ప్రయత్నం చేయను. అలా చేయడమంటే నాకు చిరాకు. నేను ఎవరిని నమ్మించాలి? నాకు ఆ అవసరం ఏముంది?

    అలాంటి పాపపు సొమ్ము తీసుకుని నేనేం బాగుపడతాను

    అలాంటి పాపపు సొమ్ము తీసుకుని నేనేం బాగుపడతాను

    నాకైనా రాజకీయాల ద్వారా కొత్తగా పేరు ప్రతిష్టలు రావాలా? రాజకీయాల్లోకి వచ్చి నేనేమైనా డబ్బులు సంపాదించాలా? అలాంటి పాపపు సొమ్ము తీసుకుని నేనేం బాగుపడతాను. ఇంత మంది కన్నీళ్ల మీద, కష్టాల మీద దోపిడీ చేసి వచ్చిన డబ్బు నా కుటుంబాని కానీ, నాకు కానీ, నా పిల్లలకు కానీ మంచి జీవితం ఇస్తుందా? నేను అలాంటి ఆలోచన విధానంతో పెరగలేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

    English summary
    Pawan Kalyan Super Answer to Student on his Credibility in Politics. "I do not need anyone's help. I'll go ahead with my work. Come with me if you believe." Pawan Kalyan said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X