అలవాటు లేదు... మీరే నా బలం, మీరే నా ఆనందం: పవన్ కళ్యాణ్
Recommended Video

చిన్ననాటి నుంచి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అలవాటు లేనందున ఈ రోజు( సెప్టెంబర్ 2) నా పుట్టినరోజు అయినప్పటికీ ఎప్పటిలాగే నేను ఎటువంటి వేడుక చేసుకోలేదు. అయితే నాపై అభిమానంతో రెండు రాష్ట్రాలు, విదేశాలలో నా పుట్టినరోజు వేడుకలు జరిపిన జనసైనికులు, అభిమానులు, వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన శ్రేయోభిలాషులకు పేరు పేరునా ధన్యవాదాలు. మీరే నా బలం. మీరే నా ఆనందం.... అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
వారికి కూడా థాంక్స్
పుష్పగుచ్ఛం పంపి శుభాకాంక్షలు తెలిపిన రామోజీ గ్రూఫ్ సంస్థల అధినేత రామోజీరావుకుగారికి, ట్విట్టర్లో శుభాకాంక్షల సందేశం పంపిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, జనసైనికులు, రెండు రాష్ట్రాల్లోని అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
జనసేన కేంద్ర కార్యాలయంలో జనసైనికులు, అభిమానుల ఘనంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.
తమ్మడు పవన్ కళ్యాణ్‌కు చిరు విషెస్
కళ్యాణ్ బాబు !!!!
నువ్వు అందుబాటులో లేవని తెలిసింది , కలవాలని అనుకొని విరమించాను .
🎉🌹🌺🌻🍰పుట్టినరోజు శుభాకాంక్షలు 🎂🌷🌸🌼
ఆ హనుమాన్ , నీకు మానసిక స్థైర్యాన్ని , ధైర్యాన్ని , ఆరోగ్యాన్ని మరియు మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను .
ఆశీస్సులతో
అన్నయ్య
చిరంజీవి

పవన్ కళ్యాణ్‌ను విష్ చేసిన ప్రముఖులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ ప్రముఖులు ఆయన్ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బెటర్ సొసైటీ కోసం మీరు పడే తపన చూసి మీకు భక్తుడినైపోయాను. లగ్జరీ జీవితాన్ని, కంఫర్టబుల్ లైఫ్ వదిలేశారు. మీరు చేసిన త్యాగం వల్లనే ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారని అల్లు అర్జున్ వ్యాఖ్యానించగా... రామ్ చరణ్ బాబాయ్ కోసం ఏకంగా పారాచూట్ జంప్ చేసి సాహసం చేశాడు.


Click it and Unblock the Notifications