పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పండగే: ఆ సినిమాలో మూడు గెటప్‌లలో పవన్ కల్యాణ్

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ది ప్రత్యేకమైన స్థానం. సినిమాలు హిట్ అయినా.. అవకున్నా.. సినిమాలు తీసినా.. తీయకున్నా ఆయన క్రేజ్‌కు ఎటువంటి ఢోకా ఉండదు. టాలీవుడ్‌లో అలా ఆదరించే ఫ్యాన్స్ ఆయన ఒక్కడికే ఉన్నారు. అందుకే వాళ్ల కోసం రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడాయన. ఇందులో భాగంగానే ప్రస్తుతం 'వకీల్ సాబ్' అనే మూవీ చేస్తున్నాడు పవన్ కల్యాణ్. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ గురించి ఓ న్యూస్ బయటకొచ్చింది.

మీషా ఘోషల్ ట్రెడిషినల్ లుక్ ట్రెండింగ్.. అందంగా ముద్దు ముద్దుగా...

సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం కావడంతో 'వకీల్ సాబ్'పై అందరి దృష్టి పడింది. దీంతో ఈ చిత్రంలో ఆయన క్యారెక్టర్‌ను బాగా ఎలివేట్ చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఇందులో పవర్ స్టార్ మూడు గెటప్‌లలో కనిపిస్తాడని తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఒకటి గుబురు గెడ్డంది కాగా, రెండోది క్లీన్ షేవ్ లుక్ అని తెలిసింది. ఇక, క్లైమాక్స్‌లో చిన్న గెడ్డంతో దర్శనమిస్తాడని అంటున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్‌కు ఈ చిత్రం పండుగలా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.

Pawan Kalyan Three Getups in Vakeel SaabPawan Kalyan Three Getups in Vakeel Saab

బాలీవుడ్‌లో బంపర్ హిట్ అవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం 'పింక్'. దీన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరిట రీమేక్ చేస్తున్నారు. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నాడు. నివేదా థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా చేస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ షూటింగ్.. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రం టీజర్‌ను నూతన సంవత్సర కానుకగా డిసెంబర్ 31న విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.

అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X