‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే న్యూస్: పవన్ చేసేది ఒక పాత్ర కాదు.. ఏకంగా 30 రకాలుగా!

త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించిన 'అజ్ఞాతవాసి' తర్వాత సినిమాలకు బ్రేకిచ్చాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఇక, సుదీర్ఘ విరామం తర్వాత 'వకీల్ సాబ్'తో రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు, దీనితో పాటు ఏకంగా మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసి అందరికీ షాకిచ్చాడు. ఈ మెగా హీరో ప్రస్తుతం చేస్తోన్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పోషించే పాత్రల గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

 ‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్

‘వకీల్ సాబ్'గా రీఎంట్రీ ఇచ్చిన పవన్

దాదాపు మూడేళ్ల విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్'. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి హిట్ టాక్ కూడా సొంతం అయింది. అయితే, పలు ఆటంకాలు ఎదురు అవడం వల్ల ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకోలేక నిర్మాతకు నష్టాలనే మిగిల్చింది.

తొలిసారి అలాంటి సినిమాకు సిగ్నల్

తొలిసారి అలాంటి సినిమాకు సిగ్నల్

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంతో తొలిసారి పిరియాడిక్‌ జోనర్‌లో నటిస్తున్నాడు పవర్ స్టార్.

సినిమా కోసం రిస్కు చేస్తోన్న పవన్

సినిమా కోసం రిస్కు చేస్తోన్న పవన్

సరికొత్త కథాంశంతో రాబోతున్న 'హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ వజ్రాల దొంగగా నటిస్తున్నాడు. అందుకే ఈ ప్రాజెక్టు కోసం అతడు గుర్రపు స్వారీతో పాటు కత్తి, కర్రసాముల్లో ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నాడట. అంతేకాదు, అతనికెంతో ఇష్టమైన గన్ షూటింగ్ కూడా ఇందులో ఉంటుందని తెలుస్తోంది. అలాగే, ఈ సినిమా కోసం పవన్ కొన్ని రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నాడని టాక్.

 పవన్ కెరీర్‌లో మొదటిసారి ఆ రేంజ్

పవన్ కెరీర్‌లో మొదటిసారి ఆ రేంజ్

మొగల్ సామ్రాజ్యం నాటి కథతో 'హరిహర వీరమల్లు' మూవీ తెరకెక్కుతోంది. దీని కోసం చార్మినార్, ఎర్రకోటతో పాటు మొగలాయీల సామ్రాజ్యపు ప్రాంగణాన్ని నిర్మించబోతున్నారట. ఇక ఈ సినిమా కోసం ఏకంగా రూ. 180 కోట్ల వరకూ ఖర్చు చేయబోతున్నారని తెలుస్తోంది. కోహినూర్ డైమండ్ చుట్టూ తిరిగే ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు.

దానికి భారీ స్పందన.. హైప్ పెరిగింది

దానికి భారీ స్పందన.. హైప్ పెరిగింది

'హరిహర వీరమల్లు' సినిమాకు సంబంధించిన వీడియోను మహా శివరాత్రి సందర్భంగా విడుదల చేశారు. ఈ టైటిల్ గ్లిమ్స్‌కు పవన్ అభిమానుల నుంచే కాక, సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా ఊహించని రీతిలో స్పందన రావడంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఫలితంగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అదే సమయంలో భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి.

పవన్ చేసేది ఒక రోల్ కాదు.. మూడు

పవన్ చేసేది ఒక రోల్ కాదు.. మూడు

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న 'హరిహర వీరమల్లు' సినిమా గురించి తరచూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా దీని గురించి ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో పవన్ మూడు పాత్రల్లో కనిపించనున్నాడట. విభిన్నంగా ఉండే ఈ రోల్స్‌కు స్టైల్స్ కూడా కొత్తగా ఉంటాయని అంటున్నారు. అలా ఎందుకు కనిపించాడనేదే సస్పెన్స్.

Recommended Video

Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Filmibeat Telugu
ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 30 డ్రెస్లు

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ 30 డ్రెస్లు

'హరిహర వీరమల్లు'లో పవన్ కల్యాణ్ మొత్తంగా 30 రకాల డ్రెస్‌లను ధరిస్తాడని తెలుస్తోంది. అవన్నీ రాజుల కాలం నాటి బట్టలే అని సమాచారం. అయితే, మూడు పాత్రలకూ మూడూ డిఫరెంట్ స్టైల్ డ్రెస్‌లు వాడబోతున్నారని తెలిసింది. ఇటీవలే ఈ మూవీ కాస్ట్యూమ్ డిజైనర్ ఓ ఇంటర్వ్యూలో ఈ వార్తలు నిజమేనని తేల్చేశారు. దీంతో ఈ సినిమాలో పవన్ క్యారెక్టర్లపై ఆసక్తి పెరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X