ట్రైనర్‌గా మారుతున్న పవన్ కల్యాణ్.. ఎందుకోసమో తెలిస్తే మైండ్ బ్లాకే!

టాలీవుడ్‌లోకి బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే వచ్చినా.. ఆరంభంలోనే తనదైన స్పెషల్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని పెద్ద హీరోగా మారిపోయాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. అలా తెలుగు చిత్ర పరిశ్రమలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా మారాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడు. ఇలా తన రేంజ్‌ను పెంచుకుంటున్నాడు.

రీఎంట్రీలో జెట్ స్పీడుతో దూసుకుపోతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇప్పటికే పలు సినిమాలతో వచ్చి అలరించాడు. ఇప్పుడు కూడా మూడు నాలుగు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్నాడు. వాటిలో 'సాహో' ఫేం సుజిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ఓజీ' (OG) ఒకటి. ఫుల్ లెంగ్త్ యాక్షన్‌తో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్న విషయం తెలిసిందే.

Pawan Kalyan Turns Martial Arts Trainer for OG Movie

పవర్‌ఫుల్ కాంబోలో హై ఓల్టేజ్ యాక్షన్‌తో రూపొందుతోన్న 'OG' మూవీకి సంబంధించిన షూటింగ్ గత ఏడాదిలోనే ప్రారంభం అయింది. అప్పటి నుంచి కొద్ది రోజుల వ్యవధిలోనే యాభై శాతం వరకూ టాకీ పార్ట్ పూర్తైంది. ఇక, ఇప్పుడు పవన్ డేట్స్ ఇవ్వని కారణంగా చిత్రీకరణ ఆగిపోయింది. త్వరలోనే మిగిలిన దాన్ని పూర్తి చేసి.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు.

సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న 'OG' మూవీ పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇందులో పవర్ స్టార్ డుయల్ రోల్ చేస్తున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే, 'OG' మూవీలో పవన్ కల్యాణ్ ఏకంగా మూడు విభిన్నమైన గెటప్‌లలో కనిపింస్తాడని ఇటీవలే న్యూస్ లీక్ అయింది.

Pawan Kalyan Turns Martial Arts Trainer for OG Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'OG' మూవీలో పవన్ కల్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా నటిస్తున్నట్లు తెలిసింది. అతడి ఇంట్రో సీన్ కూడా ఇదే ఉంటుందని సమాచారం. ముంబైలో పెద్ద పేరున్న గ్యాంగ్‌స్టర్ ఓ సాధారణ మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్‌గా ఎందుకు మారాడు అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.

ఇదిలా ఉండగా.. 'OG' మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రియాక అరుల్ మోహన్ హీరోయిన్‌గా.. అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ థమన్ దీనికి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X