Pawan Kalyan హరిహర వీరమల్లు ఇప్పట్లో లేనట్లే.. రిలీజ్ డేట్స్ లలో ఊహించని మార్పు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు లైన్ లో పెట్టి షూటింగ్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన గత ఏడాది వరకు ఒక ప్లాన్ తో ఉన్న పవర్ స్టార్ ఈ ఏడాది మాత్రం సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాడు.

ముందుగా వస్తుందని అనుకున్న హరిహర వీరమల్లు సినిమా ఇప్పట్లో వచ్చేలా లేదని అనిపిస్తోంది. ఇక మొత్తానికి బ్రో విడుదల విషయంలో క్లారిటీ రావడం వలన మిగతా సినిమాలు ఎప్పుడు వస్తాయో కూడా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Pawan kalyan upcoming movies release dates and hari hara veeramallu update

బ్రో.. ఉస్తాద్ ఫిక్స్: ఇప్పటికే సముద్రఖని దర్శకత్వంలో బ్రో మూవీ కంప్లీట్ చేసి జులై 28న రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను కొద్దిసేపటి క్రితం విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

ఇక ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చి సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమా 2024 జనవరికి వచ్చే ఛాన్స్ ఉంది.

Pawan kalyan upcoming movies release dates and hari hara veeramallu update

సుజిత్ OG ఎప్పుడు రావచ్చు?: ఇదిలా ఉంటే సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ కూడా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఈ ఏడాది ఆఖరులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అఫీషియల్ గా డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది.

Pawan kalyan upcoming movies release dates and hari hara veeramallu update

హరిహర వీరమల్లు ఎంతవరకు వచ్చింది?: ఇక పాన్ ఇండియా మూవీగా రెండేళ్ళ క్రితం క్రిష్ దర్శకత్వంలో స్టార్ట్ అయిన మూవీ హరిహర వీరమల్లు షూటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా 35 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని క్రిష్ పూర్తి చేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అనుకున్న స్థాయిలో కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయకపోవడం వలన సినిమా షూటింగ్ లేట్ అవుతోంది.

Pawan kalyan upcoming movies release dates and hari hara veeramallu update

ఈ ఏడాది రానట్లే: ఇప్పటికి పూర్తవుతుంది అనే విషయంలో కూడా ఎలాంటి క్లారిటీ లేదు. దీంతో ఈ ఏడాది మూవీ వచ్చే అవకాశం ఉందా అనేది డౌట్ గానే ఉంది. ఒక వేళ షూటింగ్ లు పూర్తయిన కూడా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏ విధంగా చూసుకున్న ఈ ఏడాది రెండు సినిమాలు మాత్రమే పవన్ కళ్యాణ్ నుంచి ప్రేక్షకుల ముందుకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.

ఏక జులై నుంచి జనసేన రాజకీయ వ్యవహారాలలో బిజీ కావడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్న నేపథ్యంలో ఎన్ని సినిమాలు పూర్తి చేస్తారు. ఎన్ని రిలీజ్ చేస్తారు అనే అంశంపై ఎలాంటి క్లారిటీ లేదనే చెప్పాలి. హరిహరవీరమల్లు అయితే ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X