‘వకీల్ సాబ్’కు పవన్ రెమ్యూనరేషన్ లీక్: నిమిషాకే కోటి.. రీఎంట్రీ కోసం అంత ఖర్చు.. మొత్తం ఎంతంటే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం. దీనికి కారణం ఏమిటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా మందికి ఆయన ఒక వ్యసనం అయిపోయాడు. అంతలా కొన్ని కోట్ల మంది ఈ మెగా హీరోను అభిమానిస్తున్నారు. అందుకే ఆయన సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని చాలా మందే కోరుకున్నారు. అందుకు అనుగుణంగానే 'వకీల్ సాబ్' చిత్రంతో కమ్‌బ్యాక్ అవుతున్నాడు. ఈరోజే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కోసం పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

లాంగ్ గ్యాప్ తర్వాత.. ‘వకీల్ సాబ్’గా రీఎంట్రీ
రాజకీయాల కోసం సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు పవన్ కల్యాణ్. ఈ నేపథ్యంలోనే 'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. వేణు శ్రీరామ్ తెరకెక్కించిన ఈ సినిమాను బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించాడు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించాడు. అంజలి, అనన్య, నివేదా థామస్‌లు కీలక పాత్రలు చేశారు.

పల్లెల నుంచి విదేశాల వరకూ.. పవన్ పవన్
పల్లెల నుంచి విదేశాల వరకూ పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా 'వకీల్ సాబ్' తిరునాళ్లు జరుగుతున్నాయి. అన్ని ఏరియాల్లోనూ పండుగలా దీన్ని జరుపుతున్నారు. అందుకు అనుగుణంగానే థియటర్లను ముస్తాబు చేశారు. ఇక, విదేశాల్లోని అభిమానులు సైతం లొకేషన్ల దగ్గర రచ్చ చేస్తున్నారు.

అక్కడ షోలు పూర్తి.. అంతటా పాజిటివ్ టాక్
ఇప్పటికే యూఎస్, దుబాయ్, ఆస్ట్రేలియా సహా కొన్ని దేశాల్లో 'వకీల్ సాబ్' ప్రీమియర్ షోలు పడిపోయాయి. అక్కడి నుంచి ఇప్పుడిప్పుడే రివ్యూలు వస్తున్నాయి. అన్ని ప్రాంతాల్లోనూ బ్లాక్ బస్టర్ టాక్ వినిపిస్తోంది. అలాగే, ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ఏరియాల్లో స్పెషల్ షోలు కూడా పడినట్లు తెలిసింది. ఇక్కడ కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సినిమాలో పవన్ కల్యాణ్ స్క్రీన్ టైమ్ ఇంతే
'వకీల్ సాబ్' మూవీ రన్‌టైమ్ 155 నిమిషాలు ఉందన్న విషయం ఇప్పటికే తెలిసిపోయింది. అయితే, అందులో పవన్ కల్యాణ్ కేవలం 50 నిమిషాలు మాత్రమే కనిపిస్తాడని కూడా వార్తలు వచ్చాయి. మిగిలిన సమయం మొత్తం ముగ్గురు అమ్మాయిల చుట్టూనే కథ తిరుగుతుందట. ఇందులో ఇంట్రడక్షన్ సీన్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్, కోర్టు సన్నివేశాల్లో మాత్రమే పవన్ కనిపించనున్నాడు.

‘వకీల్ సాబ్’ కోసం పవన్ రెమ్యూనరేషన్ లీక్
'వకీల్ సాబ్' చిత్రానికి గానూ పవన్ కల్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తూనే ఉన్నాయి. దీని కోసం అంత అందుకున్నాడు.. ఇంత చార్జ్ చేస్తున్నాడు అని ఎన్నో ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. ఈ సమయంలో పవర్ స్టార్ తీసుకున్న అసలు రెమ్యూనరేషన్ వివరాలు బయటకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. రూ. 50 కోట్లు తీసుకున్నాడట.
Recommended Video

నిమిషాకే కోటి.. రీఎంట్రీ కోసం అంత ఖర్చు
'వకీల్ సాబ్' కోసం పవన్ కల్యాణ్ 22 రోజులు షూటింగ్ చేశాడు. సినిమాలో మాత్రం 50 నిమిషాలే కనిపించనున్నాడు. అంటే నిమిషానికి కోటి రూపాయలు తీసుకున్నట్లు లెక్క. అలాగే, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్లు, నగరంలో బస చేసేందుకు వసతులు ఇలా అన్నీ కలిపి దిల్ రాజు.. పవన్ కల్యాణ్ కోసం రూ. 60 కోట్ల వరకూ ఖర్చు చేశారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











