Don't Miss!
- Lifestyle
4-7-8 బ్రీతింగ్ టెక్నిక్ అంటే ఏంటి? ఇది ఆందోళనను తగ్గిస్తుందా?
- News
తారకరత్నను చూడగానే ఒక్క సారిగా జూ ఎన్టీఆర్ ..: తారక్ కోసం మంత్రిని పంపిన సీఎం..!!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Finance
Modi Vs Manmohan: భారత ఆర్థికాన్ని ఎవరు బాగా హ్యాండిల్ చేశారు..? ప్రజలు మెచ్చింది అతడినే..
- Sports
ఒక్క మ్యాచ్ చూసి డెసిషన్ తీసుకోకూడదు.. ఇషాన్, ధవన్‌పై వెటరన్ కామెంట్స్!
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
Pawan Kalyan పవర్ స్టార్ చేతికి రెండు మహిమగల ఉంగరాలు.. వాటి వెనుక కథేంటో తెలుసా?
సినిమా పరిశ్రమలోను, రాజకీయాల్లోను సెంటిమెంట్లకు పెద్దగా ప్రాధాన్యం ఇస్తారు. జాతకాలు, పూజలు, హోమాలు, మెడలో దండలు, చేతికి ఆభరణాలు ధరించడం చూస్తూనే ఉంటాం. విజయాల కోసం, వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడం కోసం జోతిష్యులను, ఆధ్యాత్మిక గురువులను రాజకీయ నేతలు కలవడం ఇటీవల కాలంలో ఎక్కువగానే కనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన చేతికి రెండు ఉంగరాలు ధరించడంపై మీడియాలోను, అటు పాలిటిక్స్‌లోను ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

పవన్ కల్యాణ్‌లో అధ్యాత్మిక మార్పు
పవన్ కల్యాణ్ గతంలో పూజలు, జాతకాలకు కొంచెం దూరంగానే ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకొంటాయి. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అధ్యాత్మికంగా కొంత మార్పు వచ్చింది. జ్యోతిష్యులను కలిసి తన జాతకంలోని కొన్ని లోపాలను సరిద్దిద్దుకోనే ప్రయత్నం చేశారు. అలాగే హరిద్వార్ లాంటి ప్రాంతంలో కూడా పర్యటించడం తెలిసిందే.

హిందూ సంప్రదాయాలకు పెద్దపీట
ఇక గతేడాది పవన్ కల్యాణ్ దీక్ష చేపట్టడం కూడా ఆసక్తికరమైన చర్చ జరిగింది. హిందూ మత సంప్రదాయాలకు మరింత పెద్దపీట వేస్తూ కనిపించారు. అలాగే పురాతన ప్రసిద్ద ఆలయాలను కూడా సందర్శించి పూజలు చేయడం కూడా ఆయన జీవనశైలిలో భాగంగా మారింది. ఇటీవల కర్ణాటకలోని కుక్కే సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా నిర్వర్తించారు.

శ్రీరామనవమి సందర్భంగా
అంతేకాకుండా ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా హరిహర వీరమల్లు చిత్ర షూటింగులో కూడా పూజలు నిర్వహించి తన యూనిట్ సభ్యులకు అన్నప్రసాదాలు అందించారు. ఇలాంటి విషయాలు పవన్ కల్యాణ్‌లోని ఆధ్యాత్మిక చింతనకు సాక్ష్యంగా నిలిచాయి. తనకు తాను మానసికంగా ధృఢంగా మారడానికి అనేక దైవ చింతనకు దగ్గరైనట్టు కనిపిస్తున్నారు.

ఏపీలో రైతులను ఆదుకొనేందుకు
ప్రస్తుతం పవన్ కల్యాణ్ సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఏపీలో రకరకాల కష్టాలు అనుభవిస్తున్న రైతులకు అండగా నిలబడేందుకు పలు జిల్లాలో పర్యటిస్తున్నారు. గత రెండు రోజులుగా పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ చేతికి రెండు భారీ సైజులో ఉంగరాలు కనిపించడం మీడియా దృష్టికి వచ్చాయి. పవన్ చేతికి ఆ రెండు ఉంగరాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.

పవన్ చేతికి రెండు ఉంగరాలు
అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్దమవుతున్న పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికలను పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నట్టు తెలిసింది. అందుకే పవన్ జ్యోతిష్యాన్ని నమ్ముకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ చేతి వేళ్లకి కొత్తగా డైమండ్ పొదిగిన రింగ్స్ కనిపించడంతో ఎవరో అధ్యాత్మిక గురువు సలహా మేరకు వాటిని ధరించారనే విషయం వైరల్‌గా మారింది. అయితే వాటి వెనుక ఎలాంటి విషయం ఉందో తెలుసుకోవాలంటే.. పార్టీ వర్గాలు స్పష్టం చేయాల్సిందే.

పవన్ కల్యాణ్ రానున్న సినిమాలు
ఇక పవన్ కల్యాణ్ కెరీర్ విషయానికి వస్తే.. గత రెండేళ్లలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. అలాగే ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన భవదీయుడు భగత్ సింగ్ చిత్ర షూటింగులోను పాల్గొన్నారు. ఇంకా రెండు మూడు సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల కోసం సిద్దమవుతూనే.. మరోపక్క సినిమాల జోరును కొనసాగిస్తున్నారు.