పవన్ కల్యాణ్ టూ మచ్ రిస్క్.. ఎక్కడ తగ్గాలో అక్కడే అంటూ..
పవన్ కల్యాణ్.. పేరులోనే పవర్ ఉన్న హీరో. దాదాపు ఇరవై ఐదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో హవా చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. పేరుకు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడే అయినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవడానికి ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేశాడు. ఈ కారణంగానే పవన్ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా పవర్ స్టార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా అతడు రిస్క్ చేస్తుండడం షాక్‌కు గురి చేస్తోంది. ఇంతకీ ఏంటా రిస్క్.? పూర్తి వివరాల్లోకి వెళితే....

నిరీక్షణకు తెరదించిన పవన్ కల్యాణ్
త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి' తర్వాత పవన్ కల్యాణ్ సినిమాలను వీడి రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో సుదీర్ఘ విరామం అనంతరం ఆయన మరోసారి ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. ‘పింక్' రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్'తో పవన్ రీఎంట్రీ ఇస్తున్నారు. దీంతో పీకే ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది.

అదొక్కటే కాదు.. మరో రెండు కూడా..
సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని భావించిన పవన్ కల్యాణ్.. ‘వకీల్ సాబ్'తో పాటు మరో రెండు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టేశాడు. అందులో ఒకటి క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం కాగా, మరొకటి హరీశ్ శంకర్ రూపొందించబోయే మూవీ. క్రిష్ మూవీకి ఏఎమ్ రత్నం నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. హరీశ్ సినిమాను మాత్రం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

వెరీ స్పెషల్.. ఇప్పటి వరకు చేయలేదు
పవన్ ఒకేసారి లైన్‌లో పెట్టిన మూడు సినిమాల్లో క్రిష్ తెరకెక్కించేది వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. దీనికి కారణం ఈ మూవీని పిరియాడిక్ జోనర్‌లో తీస్తుండడమే. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా కోహినూర్ డైమండ్ ప్రధానాంశంగా రూపొందుతోందని ప్రచారం జరుగుతోంది. ఇందులో పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తోంది.

వారిలోలో ఎవరు.? అందులో నో క్లారిటీ
ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో దీని గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నటించే హీరోయిన్ విషయంలో కొన్ని పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలోనే ప్రగ్యా జైస్వాల్, కియారా అద్వాణీ, వాణీ కపూర్ పేర్లు తెరపైకి వచ్చినా ఎవరు ఫైనల్ అనేది తెలియలేదు.

పవన్ కెరీర్‌లో ఇలా చేయడం రెండోసారి
భారీ బడ్జెట్, హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో రూపొందబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని ఇటీవల ఓ న్యూస్ బయటకు వచ్చింది. అందులో ఒకటి రాబిన్ హుడ్ తరహా రోల్ కాగా, మరో దానిపై క్లారిటీ రాలేదు. ఈ రెండు పాత్రలూ విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది. ‘తీన్‌మార్' తర్వాత పవన్ మరోసారి డుయల్ రోల్ చేస్తున్నాడు.

ఫ్యాన్స్ కోసం పవన్ సెన్సేషనల్ డెసీషన్
ఈ సినిమా విషయంలో పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడని తాజాగా ఓ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. ఈ మూవీలో ఉండే రెండు పాత్రల్లో ఒకదాని కోసం లావుగా, మరో దాని కోసం సన్నగా కనిపించాలట. ఇప్పుడు షూటింగ్‌కు విరామం దొరకడంతో సన్నబడడం కోసం ఇంట్లోనే దాదాపు ఐదారు గంటల పాటు చెమటోడ్చుతున్నాడని సమాచారం.
Recommended Video

ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా రిస్క్.!
అదే సమయంలో ఈ సినిమా కోసం కత్తిసాము, గుర్రపు స్వారీలో సైతం పవన్ కల్యాణ్ శిక్షణ తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇప్పటికే విదేశాల నుంచి కొందరిని పిలిపించుకున్న ఆయన.. ఈ గ్యాప్‌లో వాటిలో రాటుదేలాలని భావిస్తున్నాడని సమాచారం. వేసవి అయినప్పటికీ ప్రాణాన్ని లెక్క చేయకుండా పవన్ పని చేస్తున్నాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











