కొండగట్టు అంజనేయస్వామి ఆశీస్సులతో.. రాంచరణ్ మూవీని ఏ శక్తి ఆపలేదు.. పవన్ కల్యాణ్ ఎమోషనల్
మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రాంచరణ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం పెద్ది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న చిత్రంలో జాన్వీ కపూర్, కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో హిందీ నటుడు దివ్యేందు శర్మ, జగపతి బాబు, ఉపేంద్ర లిమయే, కృతిశెట్టి, జాన్ విజయ్, చమ్మక్ చంద్ర, దయానంద్ రెడ్డి తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. కోల్లా అవినాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం, ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి, ఆంటోని రుబెన్ ఎడిటర్లుగా, దీపాలీ నూర్ క్యాస్టూమ్ డిజైనర్‌గా, స్టంట్ మాస్టర్‌గా సుప్రీం సుందర్ వ్యవహరిస్తున్నారు. ఆర్ట్ విభాగాన్ని డేవిడ్ కుమార్ బపన్నపల్లి పర్యవేక్షిస్తున్నారు. ఈ సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి పవన్ కల్యాణ్ సుదీర్ఘమైన, ఎమోషనల్ లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖలో ఏమున్నదనే వివరాల్లోకి వెళితే..

రాంచరణ్ ఎదుగుదలను, గ్లోబల్ వైడ్‌గా సూపర్‌స్టార్‌గా అవతరించిన తీరును నేను చూశాను. కేవలం నటన, ప్రతిభ మాత్రమే కాదు.. అతను చూపిన మానవత్వం, క్రమశిక్షణ, తాను నమ్ముకొన్న వృత్తిపట్ల అంకితభావమే ఆయనను ఈ స్థాయికి చేర్చింది. ఈ సినిమాను రూపొందించిన బుచ్చిబాబు నా నియోజకవర్గం పిఠాపురం కు చెందిన వారు. ఆయన జన్మభూమి మూలాలను, ప్రజలు, సంస్కృతులు, వారసత్వాన్ని ప్రతిబింంచేలా సినిమాను తీశారు అని తన లేఖలో పేర్కొన్నారు.
ఈ భారీ చిత్రం విడుదలకు ముందు ఎగ్జిబిటర్ల సమస్యలు, రిలీజ్‌కు ఏర్పడిన ఇబ్బందులు అధిగమించి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. సినిమా అనేది కేవలం ఓ వ్యక్తి మీద ఆధారపడి ఉన్నది కాదు. ఎందరో నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, త్యాగ ఫలితం. ఎగ్జిబిటర్లు, టెక్నిషియన్లు, కార్మికుల, వేతన కార్మికుల కష్టం, బలం అని అన్నారు. ఏఆర్ రెహ్మాన్, నిర్మాత సతీష్, మైత్రీ మూవీ మేకర్స్‌ను ప్రశంసించారు.
ఏ సినిమా పరిశ్రమలోనైనా రిలీజ్‌కు ముందు ఎన్నో విభేదాలు, ఆందోళనలు, చర్చలు ఉంటాయి. విడుదలకు ముందు చివరి నిమిషంలో తలెత్తే సమస్యలు చర్చలతో పరిష్కరించడమనేది బిజినెస్ కంటే.. ఇతర అంశాలే ప్రభావితం చేస్తాయి. ఇలాంటి సమస్యలు, ఇబ్బందులు కేవలం నటులను, నిర్మాతలను నష్టం కలిగించవు. అవి సినిమా పరిశ్రమ వ్యవస్థను, వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. సినిమాపై ఆధారపడి ఉన్న ఎన్నో కుటుంబాలను ఇబ్బందికి గురి చేస్తాయి అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి సమస్యలను, ఇబ్బందులను దాటుకొని తెలుగు సినిమా బలమైన శక్తిగా అవతరించిందంటే.. అందుకు కారణం సమిష్టి బలమే. కృత్రిమ ఒత్తిడులు ఆ శక్తిని బలహీన పరచలేదు. ఈ ప్రాంత ప్రజలు, మట్టి వాసన గురించి చెప్పే కథను ఏ శక్తి కూడా ఆపలేదు. ఇలాంటి అవరోధాలను అధిగమించిన రాంచరణ్, ఈ సినిమాలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చరిత్రలో నిలిచిపోయేలా విజయం అందుకోవాలని కోరుకొంటున్నాను. కొండగట్టు ఆంజనేయస్వామి దివ్యమైన ఆశీస్సులు చిత్ర యూనిట్‌కు ఉండాలి.. జై భజరంగబలి అంటూ పవన్ కల్యాణ్ తన ఆశీస్సులు అందజేశారు.


Click it and Unblock the Notifications