తరుణ్ భాస్కర్ దర్శత్వంలో మహేష్ బాబు!
సూపర్ స్టార్ మహేష్ బాబు సీనియర్ దర్శకులు, యువదర్శకులు అని తేడా లేకుండా అందరికి అవకాశం ఇస్తున్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్స్ తో పాటు సందీప్ వంగలాంటి యువ దర్శకులతో కూడా సినిమాలు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వలో మహర్షి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత మహేష్ కోసం చాలా మంది దర్శకులు ఎదురుచూస్తున్నారు.
ఆ జాబితాలోకి పెళ్లి చూపులు చిత్రంతో గుర్తింపు సొంతం చేసుకున్న తరుణ్ భాస్కర్ కూడా చేరాడు. ఇటీవల తరుణ్ భాస్కర్ వినిపించిన స్టోరీ లైన్ కు మహేష్ ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది. దీనితో పూర్తి కథ సిద్ధం చేయమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. పెళ్లి చూపులు తర్వాత తరుణ్ భాస్కర్ రూపొందించిన ఈ నగరానికి ఏమైంది చిత్రం అంతగా ఆకట్టుకో లేకపోయింది.

ఇదిలా ఉండగా మహేష్ బాబు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగతో కూడా ఓ చిత్రానికి కమిటై ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సుకుమార్ ఎలాగూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ తదుపరి చిత్రాల జాబితా పెద్దదిగానే కనిపిస్తోంది. మహర్షి చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











