»   » 18 సార్లు ఆత్మాహత్యాయత్నం.. అమీర్‌పేట్‌లో 14వ ఫ్లోర్‌ నుంచి దూకాలని ప్రయత్నించా.. ఫృథ్వీరాజ్

18 సార్లు ఆత్మాహత్యాయత్నం.. అమీర్‌పేట్‌లో 14వ ఫ్లోర్‌ నుంచి దూకాలని ప్రయత్నించా.. ఫృథ్వీరాజ్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  18 సార్లు ఆత్మాహత్యాయత్నంకి ప్రయత్నించా : పృథ్వీరాజ్

  పెళ్లి చిత్రంతో ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన నటుడు పృథ్వీరాజ్. బాలచందర్ చిత్రంతో సినిమాల్లోకి వచ్చిన ఆయన విలక్షణమైన పాత్రల్లో నటించారు. సమరసింహారెడ్డి, ప్రేయసి రావే, పెళ్లి పందిరి, నాగా, పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత వ్యక్తిగత జీవితంలో, ఫ్రొఫెషనల్ జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనల కారణంగా డిప్రెషన్‌కు లోనయ్యారు. ఇటీవల మీడియాలో తన జీవితంలో చోటుచేసుకొన్న ప్రతికూల విషయాలను వెల్లడించారు.

  18 సార్లు ఆత్మాహత్యాయత్నం

  18 సార్లు ఆత్మాహత్యాయత్నం

  ఒకనొక సందర్భంలో నేను చాలా డిప్రెషన్‌కు గురయ్యాను. దాదాపు 18 సార్లు ఆత్మహత్య చేసుకొందామని ప్రయత్నించాను. అమీర్‌పేటలోని దివ్యశక్తి అపార్ట్‌మెంట్‌లో నాకు ఓ ఫ్లాట్ ఉండేది. 14వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోదామని అనుకొన్నాను.

  ఫోన్‌లో మాట్లాడిన తర్వాత

  ఫోన్‌లో మాట్లాడిన తర్వాత

  నా అసిస్టెంట్ ఫోన్ చేసి నాతో కాసేపు మాట్లాడాడు. డిన్నర్‌కు ఏమైనా తీసుకురావాలా అని అడిగితే వద్దని చెప్పాను. ఒక రోజు సెలవు అడిగితే తీసుకోమని చెప్పాను. డబ్బులేమన్నా కావాలా అని అతడిని అడిగాను. అలా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన తగ్గిపోయింది.

  సూసైడ్స్ చేసుకోవద్దని షార్ట్ ఫిలింస్

  సూసైడ్స్ చేసుకోవద్దని షార్ట్ ఫిలింస్

  సూసైడ్ ప్రయత్నాల నుంచి బయట పడిన తర్వాత నేను సూసైడ్స్ చేసుకోవద్దని విషయంపై షార్ట్ ఫిలిం తీసాను. దాని ఫిలింకు కేవలం రెండు గంటల్లో 2 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. వైఫల్యాలున్నంత మాత్రాన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించొద్దు అని నిర్ణయం తీసుకొన్నాను అని పృథ్వీరాజ్ చెప్పారు.

  ఎన్టీఆర్ బయోపిక్‌లో

  ఎన్టీఆర్ బయోపిక్‌లో

  కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్‌లో ఓ మంచి పాత్రలో నటిస్తున్నాను. నాకు ఎన్టీఆర్‌ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఒక్క ఫ్రేమ్‌లోనైనా నటించాలని అనుకొన్నాను. కానీ నా కోరిక తీరకుండానే మహానుభావుడు మరణించాడు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌లో వేషం చిన్న వేషం ఇవ్వమని అడిగాను. కానీ వాళ్లు మంచి వేషమే ఇచ్చారని పృథ్వీరాజ్ తెలిపారు.

  బాలకృష్ణ అంటే చాలా ఇష్టం

  బాలకృష్ణ అంటే చాలా ఇష్టం

  టాలీవుడ్‌లో నాకు బాలకృష్ణ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నటన, మంచితనం అంటే నేను బాగా ఇష్టపడుతాను. బాలయ్య ఏ పాత్రలో నటించినా అందులో ఒదిగిపోతాడు. ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య అద్భుతంగా ఉన్నాడు. రిలీజ్ తర్వాత ఆయన నట విశ్వరూపం చూస్తారని పృథ్వీ వెల్లడించారు.

  English summary
  Prithiveeraj an actor in the 1980s by acting in some low budget Malayalam movies before starring in Vaaname Ellai directed by K.Balachander. He got recognisation with Pelli. He revealed his depression days to media recently.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more