50 ఏళ్ళ చరిత్ర ఉన్న బ్యానర్ లో శ్రీకాంత్ తనయుడి ప్రాజెక్ట్.. పెళ్లి సందD అనంతరం డిఫరెంట్ మూవీ!

సీనియర్ టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఒకప్పుడు పెళ్లిసందడి సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక సరిగ్గా ఇరవై ఐదేళ్ల అనంతరం అదే టైటిల్ తో శ్రీకాంత్ కొడుకు రోషన్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ వచ్చిన ఆ సినిమా తో రోషన్ ఓ వర్గం ఆడియెన్స్ కు బాగానే దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు. ఈ రోషన్ తన తదుపరి సినిమాను మరింత డిఫరెంట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అసలైతే మొదట రోషన్ పదహారేళ్ల లోనే నిర్మల కాన్వెంట్ అనే ఒక సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అప్పట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసినప్పటికీ కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇక ఇటీవల వచ్చిన పెళ్లి సందD సినిమా మాత్రం పాజిటివ్ టాక్ తో పాటు బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా కూడా మంచి లాభాలను అందించింది. పెట్టిన పెట్టుబడికి ప్రాఫిట్స్ రావడంతో రోషన్ కు బడా ప్రొడక్షన్ హౌస్ ల నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక త్వరలోనే రోషన్ తో 50 ఏళ్ల అనుభవం కలిగిన ఒక నిర్మాణ సంస్థ కొత్త సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఆ నిర్మాణ సంస్థ మరేదో కాదు. గత 50 ఏళ్లుగా ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను తీసుకువచ్చిన వైజయంతి మూవీస్. ప్రస్తుతం చాలామంది కొత్త దర్శకులకు యువ హీరోలకు ఈ సంస్థ మంచి అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేస్తోంది.

Pelli SandaD hero roshan interesting project with vyjayanthi movies

అంతేకాకుండా వైజయంతి మూవీస్ అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ ను కూడా జతచేసి కొన్ని చిన్న సినిమాలను కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం వైజయంతి మూవీస్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ K తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు. అంతేకాకుండా స్వప్న సినిమా వైజయంతి సంయుక్తంగా రోషన్ తో ఒక కొత్త సినిమాను మొదలు పెట్టబోతున్న ట్లుగా అఫిషియల్గా క్లారిటీ ఇచ్చేశారు. నేడు రోషన్ పుట్టినరోజు కావడంతో ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేయడం జరిగింది. ప్రత్యేకంగా హ్యాపీ బర్త్ అంటూ ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ తో రాబోతున్నట్లు తెలియజేశారు.

ఇక ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా రోషన్ కెరీర్ ను మరో రేంజ్ కి తీసుకు వెళ్తుంది అని చెప్పవచ్చు. ఇక వైజయంతి మూవీస్ ప్రాజెక్ట్ K విషయానికి వస్తే ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారు. సైన్స్ ఫిక్షన్ ఫ్యూచర్ ఫిలిం రాబోతున్న ఈ సినిమా కోసం కొన్ని డిఫరెంట్ కార్లను వాడడం కోసం ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ మహేంద్ర మోటార్స్ తో ఒప్పందం కుదుర్చుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అలాంటి ప్రొడక్షన్స్ సంస్థ ఇప్పుడు రోషన్ తో సినిమా చేస్తూ ఉండడం అతని కెరీర్ కు మరింత ఉపయోగపడుతుంది. ఇక రోషన్ మరికొన్ని నిర్మాణ సస్థలతో బడా ప్రాజెక్టులను కూడా లైన్ లో పెట్టాలని చర్చలు జరువుతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X