కుక్కపిల్లల రక్షణలో ఆది పినిశెట్టి ... వైరల్ వీడియో
కోలీవుడ్ లో హీరోగా నటిస్తూనే ఉన్నా టాలీవుడ్ నుంచి మంచి పాత్ర ఉందన్న కబురు అందితే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతాడు ఆది పినిశెట్టి. పాత్ర ఎలాంటిదైనా, అందులో తనదైన మార్క్ వేసే ఆది ఇప్పుడు గుడ్ లక్ సఖిలోనూ ఓ కీలకమైన రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ లో భాగంగా అబ్బాయి ఓ రెస్క్యూ ఆపరేషన్ కూడా చేసేశాడట.
గుడ్ లక్ సఖి షూటింగ్ నిమిత్తం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్న ఆది పినిశెట్టి, సెట్స్ కు కాస్త దూరంలో ఎదో అలికిడి వినిపించడంతో అటువైపుగా వెళ్లి, ఓ రెండు కక్కపిల్లలను రక్షించాడట. ఓ పైప్ లైన్ లో ఉండిపోయిన రోజుల వయసు కుక్క పిల్లలను జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చి, వాటికి పాలుపట్టించి కాసేపు బుజ్జగించాడు కూడా. ఈ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా, అది నిమిషాల వ్యవధిలోనే వైరల్ గా మారిపోయింది.

నగేశ్ కుకునూర్ దర్శకత్వంలో తరెకెక్కుతున్న గుడ్ లక్ సఖి ఆఖరి షెడ్యూల్ పూర్తి చేసేందుకు ప్రస్తుతం టీమ్ అంతా హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే. కీర్తీ సురేశ్ సైతం కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ చేరుకుంది. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి గోలి రాజు అనే థియేటర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. మరి నటనతో పాటూ మంచి మనసుతోనూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటోన్న ఆది పినిశెట్టి మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











