Mahesh Babu: సర్​ప్రైజ్​ అదిరింది.. ఇకపై ప్రతి షాప్​లో మహేశ్​ బాబు.. ఫ్యాన్స్​కు పండగే!

సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ ఫిదా అయిపోతారు. అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ ఒకటి వచ్చింది. ఈ విషయం తెలిస్తే సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుష్ అయిపోతారు. ఇక నుంచి ప్రతిషాప్, ప్రతి రెస్టారెంట్, ప్రతి షాపింగ్ మాల్.. ఎక్కడైనా.. దేశం మొత్తం మహేష్ బాబు ఉండనున్నారు. అదేంటి అదేలా సాధ్యం అనుకుంటున్నారా... అసలు విషయం ఈ స్టోరీలో తెలుసుకుందాం పదండి.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తీసింది 28 సినిమాలు అయినా.. ఆయన క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెెవెల్ అంతే. ఇక తన 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో ఉండనుంది. ఇక ఈ సినిమా కోసం ఇప్పటికే కసరత్తులు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా ప్రెస్ మీట్ ఉండనుందని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తరహాలోనే ఈ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు తెలియజేయనున్నాని తెలుస్తోంది.

Phone Pe Transactions With Super Star Mahesh Babu Voice in Smart Speakers News Goes Viral

ఇక ఆ విషయం పక్కన పెడితే.. మహేష్ బాబు సినిమాల కంటే కమర్షియల్స్ ప్రమోషన్స్ అండ్ యాడ్స్ తోనే ఎక్కువ సంపాదిస్తుంటారనే విషయం తెలిసిందే. అయితే ఆ సంపాదనని తన కోసం కాకుండా పేదలు కోసం, చిన్న పిల్లల చికిత్సల కోసం ఉపయోగిస్తుంటారు సూపర్ స్టార్. ఇప్పటికే మహేష్ పాతికకు పైగా బ్రాండ్స్ కి అంబాసడర్ గా చేస్తూ వస్తుండగా... తాజాగా మరో సంస్థకి అంబాసడర్‌గా మారారు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ప్రముఖ మనీ ట్రాన్స్ఫర్ యాప్ ఫోన్‌ పే గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. డిజిటల్ యుగంలో అంతా ఇలాంటి యాప్ లు వాడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఫోన్ పే స్మార్ట్ స్పీకర్లకు మహేష్ తన వాయిస్ ను ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే మనం ఫోన్ పే నుంచి మనీ సెండ్ చేసినప్పుడు.. మనీ రీసివ్డ్ అంటూ కంప్యూటర్ జెనెరేటెడ్ వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు ఆ వాయిస్ కి బదులు మహేష్ బాబు వాయిస్ వినిపించబోతుందట.

Phone Pe Transactions With Super Star Mahesh Babu Voice in Smart Speakers News Goes Viral

ఇందుకోసం మహేష్ వాయిస్ తో కొన్ని శాంపిల్స్ తీసుకోని AIతో వాయిస్ ని జెనెరేట్ చేశారు ఫోన్ పే నిర్వాహకులు. ఇక నుంచి కొత్త ఫోన్‌ పే స్మార్ట్ స్పీకర్లలో మీ నగదు లావాదేవీలు మహేష్ బాబు వాయిస్ తో వినొచ్చన్నమాట. కాగా ఇప్పటికే అమితాబ్ బచ్చన్ వాయిస్ తో కూడా ఫోన్‌పే లావాదేవీలు వినిపిస్తూ మార్కెట్ లోకి వచ్చాయి. ఇప్పుడు మహేష్ బాబు వాయిస్ తో ప్రతి షాపులోనూ లావాదేవిలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక ఆ షాపులో లావాదేవీలు జరపరు కావొచ్చు అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు... మహేష్ బాబు రిసివ్డ్ బాస్ అని చెప్పే వాయిస్ కు మరి అమ్మాయి ట్రాన్సక్షన్ జరిపినా బాస్ అనే అంటాడా అంటూ కామెంట్ పెడుతున్నారు. ఇది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ యాడ్ షూటింగ్స్ ముగిస్తే.. మహేష్ బాబు పూర్తిగా జక్కన్న కంట్రోల్ లోకి వెళ్లనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X