Balayya: అబ్బా ఏమున్నాడ్రా బాబు.. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలయ్యను చూస్తే ఫ్లాటే?
నట సింహం బాలయ్య ఈ మధ్య సూపర్ జోష్ లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి సూపర్ హిట్టును అందుకున్న బాలయ్య... ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా సెట్ నుంచి బాలయ్య లుక్స్ బయటకు వచ్చాయి. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ మాత్రం... ఏమున్నాడు రా బాబు... అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య ఆకట్టుకుంటున్నాడు. ఆ వివరాల్లోకి వెళితే....
బాలయ్య బాబు ఈ మధ్యకాలంలో సూపర్ యాక్టివ్ గా ఉన్నారు. వయసు మీద పడుతున్నా... కుర్ర హీరోలకు గట్టి పోటీనిస్తూ సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.అటు డ్యాన్స్ ల్లోనూ, యాక్టింగ్ లోనూ.. తనదైన మార్క్ చూపిస్తున్నాడు బాలయ్య. ఇక ఆయన ఈ ఏడాది వీర సింహరెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లను రాపట్టింది. ఈ మూవీతో బాలయ్య తన సత్తా ఏమిటో చూపించారు.

బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ మూవీలో కాజల్ ఆగర్వల్ హీరోయిన్ గా నటిస్తుడంగా... శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఈ మూవీకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ వీపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే బాలయ్య మూవీ భగవంత్ కేసరి దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే వర్షం, ఎండ అని చూడకుండా మేకర్స్ సినిమా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే ఈ మూవీ లోకెషన్ లోనే.. మరో మూవీలోని హీరోయిన్ వచ్చి బాలయ్యను కలిసింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట షేక్ చేస్తున్నాయి. ఆ ఫోటోలు బయటకు రావడంతో.. బాలయ్య లుక్ బయటకు వచ్చింది. దీంతో ఏం ఉన్నాడు రా బాబు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకం పై శరత్ బాబు తనయుడు ఆయుష్ హీరోగా చేస్తున్న సినిమా దక్ష. తల్లాడ శ్రీనివాస్ నిర్మాతగా, వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 25న థియేటర్లలో విడుదలకి సిద్దంగా ఉంది.ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర , బాలయ్య సినిమా "భగవంత్ కేసరి" లొకేషన్లో కలిసి, బాలయ్య ఆశీస్సులు తీసుకుంది. ఈ సందర్భంగా బాలక్రిష్ణ దక్ష టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ బాలకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి, సున్నితమైన మనసు గల వ్యక్తి, మా దక్ష సినిమా కి విషెస్ తెలిపారు, అలానే భోజనం కూడా కలిసి చేశాం.. తన అనుభవం మా లాంటి యువతకి మార్గదర్శనియం అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆయనతో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో బాలయ్య ఆకట్టుకుంటున్నారు .ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.


Click it and Unblock the Notifications











