షాకింగ్: పవన్ కల్యాణ్ సీరియస్.. ఇకపై అలా జరిగితే బాగోదని దర్శక నిర్మాతలకు వార్నింగ్.!
కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఒకటి. కొన్నేళ్ల క్రితం ఓ పొలిటికల్ పార్టీని స్థాపించిన ఆయన.. సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. అదే సమయంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ మెగా హీరో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ మరోసారి సినిమాల్లోకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకే దీనికి సంబంధించిన అంశాల కారణంగా ఆయన ఈ మధ్య తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా పవర్ స్టార్ దర్శక నిర్మాతలకు వార్నింగ్ ఇచ్చారని ఓ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. అసలేం జరిగింది.? వివరాల్లోకి వెళితే....

పవన్ కోసం వాళ్లంతా క్యూ కట్టారు
పవన్ కల్యాణ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చినప్పటికీ.. ఆయనను చాలా మంది ఫిల్మ్ మేకర్లు సంప్రదిస్తూనే ఉన్నారని ఆ మధ్య వార్తలు వెలువడ్డాయి. తమ బ్యానర్‌లో సినిమా చేయాలని ఎంతో మంది నిర్మాతలు కథలను పట్టుకుని పవన్ ఇంటి ముందు క్యూ కట్టారు. కానీ, పవర్ స్టార్ మాత్రం ప్రజా సేవకే పని చేస్తానని వాళ్లందరికీ తేల్చి చెప్పేశారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఈయనొక్కడే సక్సెస్ అయ్యాడు
పవర్ స్టార్‌ను మరోసారి సినిమాల్లోకి తీసుకురావాలని చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ.. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు మాత్రమే అది సాధ్యమైంది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ బోనీ కపూర్‌తో కలిసి నిర్మించనున్న సినిమా ద్వారా పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నారు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన ‘పింక్'కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి వేణు శ్రీరామ్ దర్శకుడు.

పవన్ కల్యాణ్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం
కొద్ది రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ఓ సెన్సేషనల్ న్యూస్ ఇండస్ట్రీ సర్కిళ్లలో చక్కర్లు కొట్టింది. అదే.. ‘పింక్' రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా కోసం పవర్ స్టార్ రూ. 50 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకోబోతున్నారట. సినిమా మొత్తం బడ్జెట్‌లో పవన్ తీసుకునే మొత్తమే డెబ్బై శాతం ఎక్కువ అని కూడా ప్రచారం జరిగింది. ఆయన క్రేజ్ వల్లే ఇంత ఇవ్వనున్నారని టాక్.

సినిమా టైటిల్.. హీరోయిన్లు ఫిక్స్
వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతుల కథగా తెరకెక్కే ఈ సినిమాలో లాయర్ పాత్ర ముఖ్యమైనది. ఆ పాత్రనే పవన్ పోషిస్తున్నాడు. అందుకే ఈ సినిమాకు ‘లాయర్ సాబ్' అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అలాగే, ఇందులో నటించే ముగ్గురు అమ్మాయిల పాత్రలకు నివేదా థామస్, అంజలి, అనన్యలను తీసుకుంటున్నారట.

మొదటిది పూర్తైంది.. అంతలోనే షాక్
ఇటీవల పవన్ నటిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రీన్ టెస్ట్ ముగిసింది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫిల్మ్ స్టూడియోలో జరిగిన ఈ టెస్టుకు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇందులో భాగంగా ఓ సీన్‌ను చిత్రీకరించారు. దీంతో చిత్ర యూనిట్ ఖుషీ అయింది. అయితే, అంతలోనే ఊహించని విధంగా దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
Recommended Video

వాళ్లపై పవన్ కల్యాణ్ సీరియస్
ఈ మూవీకి సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమా డైరెక్టర్ వేణు, నిర్మాత దిల్ రాజుపై పవన్ సీరియస్ అయ్యారట. ఈ మూవీకి సంబంధించిన వీడియోలు, రెమ్యూనరేషన్ వివరాలు సహా ఎన్నో అంశాలు బయటకు వస్తుండడం వల్లే ఆయన ఫైర్ అయ్యారని తెలిసింది. మరోసారి ఇలా జరగకూడదని వాళ్లకు వార్నింగ్ కూడా ఇచ్చాడట పవన్.


Click it and Unblock the Notifications











