పైరసీ వల్ల క్రేజ్ సంపాదించుకున్న హీరో.. ఎవరు? ఎక్కడ? ఎలా?

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కు సౌత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన చిత్రాలకు, నడవడికకు దేశమొత్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ఆయన సినీ రంగంలో సాధించిన ఘనతను కీర్తించనవి వారు ఉండరు. అమీర్ ఖాన్ సినిమాలకు నార్త్, సౌత్, ఇండియన్ లాంగ్వేజీలతో పాటు విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన కొత్త సినిమాల కోసం ఫ్యాన్స్, ఆడియెన్స్ ఎదురుచూస్తుంటారు. 'దంగల్'తో ఇండియాస్ హయ్యేస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన మొదటి చిత్రం కూడా అని పేరు మీదనే రికార్డు అయ్యింది. ఇలా చాలానే ఘనత సాధించారు.

అలాంటి అమీర్ ఖాన్ చిత్రం ఒకటి పైరసీగా మారింది. మాములుగా పైరసీ వల్ల చిత్ర నిర్మాతలు, నటీనటులు చాలా నష్టపోతారు. జనాలు థియేటర్లకు రాకపోవడంతో నిర్మాతలు, తమ పెర్ఫామెన్స్ జనాల్లోకి వెళ్లకపోవడంతో యాక్టర్లకు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ కారణంగా ఎప్పటి నుంచో 'పైరసీ వద్దు' అనే స్లోగన్ ను ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో వినిపిస్తూనే ఉంది. పైరసీ భూతం వల్ల ఇప్పటికీ నిర్మాతలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. టాలీవుడ్ లోనూ రీసెంట్ గా 'తండేల్', అంతకు ముందే 'గేమ్ ఛేంజర్' పైరసీ అయిన విషయం తెలిసిందే. దీనిపై నిర్మాతలు, ఫిల్మ్ చాంబర్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తోంది. కేసులు కూడా నమోదయ్యాయి.

Piracy Made Bollywood Actor Amir Khan as Star There How it was happened

అయితే.. అమీర్ ఖాన్ విషయంలో మాత్రం పైరసీ వల్ల అత్యధిక జనాభా కలిగిన దేశంలో స్టార్ ఇమేజ్ దక్కింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ - ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ కాంబోలో వచ్చిన చిత్రం '3 ఇడియట్స్'. 2009లో వచ్చిన ఈ యూత్ అండ్ కామెడీ డ్రామా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అమీర్ ఖాన్, ఆర్ మాధవన్, షర్మాన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. కరీనా కపూర్ లీడ్ యాక్ట్రెస్. అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసి తెలుగులో డబ్ చేసిన విషయం తెలిసిందే. కాగా.. ఈ చిత్రంతో అమీర్ ఖాన్ అత్యధిక జనాభా కలిగిన దేశం 'చైనా'లో స్టార్ ఇమేజ్ దక్కడం విశేషం.

ప్రస్తుతం ఇండియన్ మూవీస్ చైనాలోనూ అప్పుడప్పుడు ప్రదర్శితమవుతున్నాయి. కానీ 20ల ప్రారంభంలో అంత పెద్దగా లేదు. కానీ ఆ వ్యవధిలో వచ్చిన 3 Idiot చైనాలో ఒక ఊపూపింది. దానికి కారణం పైరసీ. ఇక్కడి సినిమా పైరసీ మూలంగా చైనా వరకు వెళ్లిందంట. దాంతో అక్కడ కూడా ఆ చిత్రం పెద్ద హిట్ అయ్యి.. అమీర్ ఖాన్ స్టార్ గా మారారంట.. మిస్టర్ పర్ఫెక్ట్ కు చైనాలోనూ అభిమానులు ఉండటం విశేషం. ఇక పైరసీ విషయంలో చైనా ప్రజలకు అమీర్ ఖాన్ పరిచయం అయ్యారు.

Piracy Made Bollywood Actor Amir Khan as Star There How it was happened

ఇక అప్పటి నుంచే పైరసీ భూతాన్నితరిమేందుకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టెక్నీకల్ టీమ్, సైబర్ టీమ్ శతవిధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ చాపకింద నీరులా పైరసీగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. ఇటీవల పైరసీపై నిర్మాతలు, దర్శకులు, సైబల్ సెల్ కూడా మరింత పట్టుబిగించింది. ఇదే విషయంలో మహేశ్ బాబు - ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రూపుదిద్దుకుంటున్న SSMB29 సెట్స్ లోనూ జక్కన్న హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. అన్ని విధాలుగా కంటెంట్, ఈవెన్ సింగిల్ ఫొటో కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

More from Filmibeat

Read more about: amir khan piracy 3 idiot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X