PKShouldSayApologizeToPrabhas : ప్రభాస్ కు పవన్ ఎందుకు సారీ చెప్పాలి?

కాదేదీ గొడవకి అనర్హం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు నేటి హీరోల అభిమానులు. హీరోల అభిమానుల మధ్య గొడవలు ఉండటం అనేది ఎప్పటి నుంచో సహజంగా జరిగే ప్రక్రియే. కానీ ఒకప్పుడు హీరోల అభిమానుల మధ్య ఎలాంటి గొడవలు ఉన్నా అవి బయటకు రానిచ్చేవారు కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా గొడవ పడుతున్న నేపథ్యంలో తమ హీరోలకు సైతం చెడ్డపేరు తీసుకొస్తున్నారు సదరు అభిమానులు. ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి క్షమాపణలు చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున ట్రెండ్ జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే

పేర్లు చెడగొట్టే విధంగా

పేర్లు చెడగొట్టే విధంగా


ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఒకప్పుడు హీరోల అభిమానులు తమ హీరో పేరు మీద రక్త దానం, అన్నదానం చేస్తూ వారికి పేరు తీసుకు రావడానికి ప్రయత్నించే వారు. ఇప్పటికీ అలాంటి అభిమానులు తమ పని తాము సైలెంట్ గా చేసుకుంటూనే ఉన్నారు, కానీ సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కొంతమంది తమ అభిమాన హీరోల పేర్లు చెడగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు.

ట్విట్టర్లో ట్రెండ్

ట్విట్టర్లో ట్రెండ్


ఈ మధ్యకాలంలోనే మెగా అభిమానులు- అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది అందరికి మనకు తెలిసిందే. ఆ వివాదం సద్దుమణిగింది అనుకున్నామో లేదో ఇప్పుడు మరో వివాదం తెరమీదకు వచ్చింది. తెరవెనుక ఏం జరిగిందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ ప్రభాస్ కు సారీ చెప్పాలి అంటే ఒక హ్యాష్ ట్యాగ్ #PKShouldSayApologizeToPrabhas ట్విట్టర్లో ట్రెండ్ అవుతుంది.

అసలు ఏం జరిగింది

అసలు ఏం జరిగింది


అసలు ఏం జరిగింది ప్రభాస్ కు పవన్ కళ్యాణ్ ఎందుకు సారీ చెప్పాలి అనే విషయం మీద ఎవరికీ ఏమీ అర్థం కాని పరిస్థితి. కొందరు అయితే ఇలా మీ అభిమాన హీరోల పరువు ఎందుకు తీస్తున్నారు అంటూ నేరుగానే ప్రశ్నిస్తున్నారు. కానీ అసలు ఏం జరిగింది అనే విషయం మీద మాత్రం ఎవరూ సరైన క్లారిటీ ఇవ్వడం లేదు.

ప్రభాస్ ను దూషించారని

ప్రభాస్ ను దూషించారని


అయితే ట్విట్టర్ ఈ మధ్య స్పేస్ అని ఒక ఆప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని ప్రకారం ట్విట్టర్ యూజర్లు ఒక మీటింగ్ రూమ్ లాగా ఏర్పాటు చేసుకుని అందులో వాయిస్ ద్వారా మాట్లాడుకోవచ్చు తాజాగా ఇలాంటి స్పేస్ ఒకటి జరగగా అందులో పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రభాస్ ను దూషించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ కు పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి అంటూ ప్రభాస్ ఫాన్స్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

పునరావృతం కాకుండా

పునరావృతం కాకుండా

అయితే ప్రభాస్ అభిమానులు చేస్తున్న డిమాండ్ సమంజసంగా లేదని కొంతమంది అంటున్నారు. కానీ ప్రభాస్ ఫాన్స్ ఏమో పవన్ కళ్యాణ్ అభిమానులు తమ అభిమాన హీరోని ఎందుకు తిట్టాలి అని ప్రశ్నిస్తున్నారు. అయితే హీరోలందరూ కలిసి మెలిసి ఉండాలి అని చెబుతూ ఒక సినిమాను మరొకరు ప్రమోట్ చేసుకుంటూ చాలా మంచి పోటీ వాతావరణంలో సినిమాలు చేస్తుంటే వారి అభిమానులు మాత్రం తమ హీరోలకే కాకుండా మొత్తం సినీ పరిశ్రమకే చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తించడం ఏ మాత్రం బాలేదు అంటున్నారు విశ్లేషకులు.

ఆయా హీరోలు ఎలాగూ స్పందించరు కనీసం ఆయా హీరోల పీఆర్ టీమ్స్ అయినా స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X