లావణ్యకి నోటీసులు.., రాజ్ తరుణ్‌పై చర్యలు.. పోలీసులు భారీ ట్విస్ట్
రాజ్ తరుణ్ - లావణ్య కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. తనను మోసం చేసి మరో అమ్మాయితో రాజ్ తరుణ్ ఎఫైర్ పెట్టుకున్నాడని లావణ్య నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్విక అన్న పేరుతో ఒకే ఇంట్లో ఉన్నామని.. అదే పేరుతో విదేశాలకు సైతం వెళ్లామని లావణ్య తెలిపింది. తాను గర్భం దాల్చితే రాజ్ తరుణే అబార్షన్ చేయించాడని ఆమె ఆరోపించింది. హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఎంటరయ్యాకే రాజ్‌తో తనకు దూరం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు మెడికల్ రిపోర్ట్స్, దాదాపు 170కి పైగా ఫోటోలను పోలీసులకు అందజేసింది. వీటి ఆధారంగా రాజ్ తరుణ్‌పై ఐపీసీ సెక్షన్ 420, 493, 506 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ పరిణామాలతో రాజ్ తరుణ్ మెడకు గట్టిగానే ఉచ్చు బిగుసుకుంటోంది. ఫిర్యాదులో ఆరోపించిన అంశాలకు తగ్గ ఆధారాలను లావణ్య సమర్పిస్తే ఆయనకు శిక్ష గట్టిగానే పడే అవకాశాలు ఉంటున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అటు రాజ్ తరుణ్ సైతం లీగల్‌గానే పోరాటం చేసేందుకు సిద్ధమైనట్లుగా కథనాలు వస్తున్నాయి. మరోవైపు తన పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా ఆరోపణలు చేసిన లావణ్యపై మాల్వీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తన కో స్టార్ మాత్రమేనని, ఆయనతో ఆరు నెలలుగా మాట్లాడింది లేదని మాల్వీ స్పష్టం చేశారు. రాజ్‌తో కలిసి నటించిన హీరోయిన్లకు లావణ్య ఫోన్లు చేసి వేధిస్తోందని ఆమె ఆరోపించారు.

ఇదిలావుండగా.. రాజ్ లేని జీవితం తనకొద్దని , వెళ్లిపోతున్నానంటూ తన లాయర్ దిలీప్ సుంకరికి లావణ్య శుక్రవారం అర్ధరాత్రి సూసైడ్ మెసేజ్ పెట్టడం కలకలం రేపింది. జీవితంలో అన్నీ కోల్పోయానని, అందరి వల్లా మోసపోయానని ఆమె అందులో పేర్కొన్నారు. రాజ్ తరుణ్ పూర్తిగా మారిపోయాడని, తన చావును కోరుకుంటున్నాడని ఆరోపించింది. రాజ్ తల్లిదండ్రులు, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాలే తన చావుకు కారణమని పేర్కొంది. అయితే దిలీప్ సుంకర వెంటనే పోలీసులకు సమాచారం అందించడం.. వారు లావణ్య ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మరోవైపు.. రాజ్ తరుణ్ - లావణ్య కేసుకు సంబంధించి పోలీస్ ఉన్నతాధికారులు కీలక విషయాలు వివరించారు. డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. లావణ్య రెండు సార్లు తమకు ఫిర్యాదు చేసిందన్నారు. మాల్వీ మల్హోత్రా, ఆమె కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని లిఖితపూర్వకంగా రాసిచ్చిందని శ్రీనివాస్ చెప్పారు. అయితే ఆ బెదిరింపులు ఫిజికల్‌గానా, ఫోన్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానా అన్న క్లారిటీ ఇవ్వాల్సిందిగా లావణ్యకు నోటీసులు ఇచ్చామని తెలిపారు.
దీనిపై లావణ్య స్పందించి మరోసారి నార్సింగి పోలీస్ స్టేషన్‌కు వచ్చి.. మరో ఫిర్యాదు చేశారని శ్రీనివాస్ వెల్లడించారు. తనతో సహజీవనం చేసి, పెళ్లి చేసుకున్నానని నమ్మించి.. ఇప్పుడు నువ్వు నా భార్యవి కాదని రాజ్ తరుణ్ అన్నట్లుగా లావణ్య అందులో ప్రస్తావించినట్లు డీసీపీ తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలను లావణ్య అందజేస్తే రాజ్‌తరుణ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని శ్రీనివాస్ వెల్లడించారు. ఈ క్రమంలో కేసు ఎటు వైపు తిరుగుతుందోనని సినీ జనాలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.


Click it and Unblock the Notifications











