పవన్ కోసం ప్రత్యేకమైన సెట్: గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి దాన్ని నిర్మిస్తున్నారట

స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - టాలీవుడ్ హంక్ దగ్గుబాటి రానా కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియం'కు ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మల్టీస్టారర్ మూవీని విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర రూపొందిస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

లోకల్ డాన్.. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే ఆధిపత్య పోరుతో తెరకెక్కుతోన్న 'అయ్యప్పనుమ్ కోషియం' మూవీ రీమేక్ షూటింగ్‌ను త్వరలోనే పున: ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో పోలీస్ స్టేషన్ సెట్‌ను నిర్మిస్తోందని తాజాగా తెలిసింది. ఇప్పటికే చాలా వరకూ ఇది పూర్తయినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక, గతంలోనూ 'గబ్బర్ సింగ్' సినిమా కోసం పోలీస్ స్టేషన్ సెట్ నిర్మించారు. ఆ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే ప్రయోగం చేస్తుండడం వల్లే మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు.

Police Station Set for Pawan Kalyans Ayyappanum Koshiyum Remake

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్ ఆఫీసర్‌గానూ, రానా లోకల్ డాన్‌గానూ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇక, ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు అందిస్తుండటంతో పాటు, పర్వవేక్షణ బాధ్యతలు కూడా తీసుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈ చిత్రానికి 'బిల్లా రంగ' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X