twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌లో బయటకు వచ్చిన నిఖీల్.. పోలీసులు అడ్డుకోవడంతో ఒకే ఒక్క ట్వీట్, ప్రాబ్లమ్ సాల్వ్!

    |

    టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నిఖీల్ సిద్దార్థ్ వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా నిజమైన హీరో అనిపించుకుంటున్నాడు. జనాలకు చాలా దగ్గరగా ఉండే ఈ స్మార్ట్ యాక్టర్ అప్పుడప్పుడు కొన్ని మంచి పనులతో మరింత దగ్గరవుతున్నాడు. ఇక సడన్ గా నిఖీల్ కు ఇటీవల ఒక చేదు అనుభవం ఎదురయ్యింది. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో రోడ్డుపైకి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఒక్క ట్వీట్ తోనే నిఖీల్ అనుమతి పొందాడు.

    Recommended Video

    Hero Nikhil ఎమోషనల్.. మిగిలింది అదొక్కటే.. అందరికీ ఇచ్చి పడేశాడు!! || Filmibeat Telugu
     వారి శక్తి మేరకు

    వారి శక్తి మేరకు

    లాక్ డౌన్ లో చాలా మంది సెలబ్రిటీలు ఎవరికి తోచినంత సహాయాన్ని వారు చేస్తున్నారు. సోనూసూద్ దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్స్ తో జనాల్లో దేవుడిగా మారిపోతున్నాడు. ఇక ఆ రేంజ్ లో కాకపోయినా మరికొందరు వారి శక్తి మేరకు మందులు ఆక్సిజన్ సిలిండర్స్ ను పంపిస్తున్నారు.

    నిఖిల్ కూడా..

    నిఖిల్ కూడా..

    ఇక హీరో నిఖీల్ కూడా ట్విట్టర్ ద్వారా సెకండ్ వేవ్ ఉధృతి పెరిగినప్పటి నుంచి సహాయం అందిస్తున్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా అడిగిన ప్రతి వారికి కూడా సహాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. చిన్న హీరో అయినప్పటికీ నిఖీల్ పెద్ద మనసున్న హీరోగా అభిమానులు మన్ననలను పొందుతున్నాడు.

    లాక్ డౌన్ లో బయటకు రావడంతో

    లాక్ డౌన్ లో బయటకు రావడంతో

    ఇక ఇటీవల ఎమర్జెన్సీ కేసు ఉండడంతో తన సన్నిహితులలో ఒకరికి మెడిసిన్ ఇవ్వడానికి నిఖీల్ కారులో వెళ్ళాడు. ఉప్పల్ నుంచి కిమ్స్ కు వెళ్లే మార్గం మధ్యలో పోలీసులు అడ్డుకొని లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో బయటకు వెళ్లినప్పుడు ఈ పాస్ తీసుకోవాలని సూచించారు. అయితే సర్వర్ పనిచేయలేదని అందుకే తీసుకోలేదని రోగికి సంబంధించిన వివరాలను ప్రిస్క్రిప్షన్ చూపించినట్లు నిఖీల్ ట్విట్టర్ ద్వారా. తెలిపారు.

     ఒక్క ట్వీట్ తో.. ప్రాబ్లమ్ సాల్వ్

    ఒక్క ట్వీట్ తో.. ప్రాబ్లమ్ సాల్వ్

    ఎంతగా వివరణ ఇచ్చినప్పుటికీ అనుమతి ఇవ్వకపోవడంతో నిఖీల్ వేసిన ట్వీట్ కు వెంటనే హైదరాబాద్ సీటీ పోలీసులు స్పందించారు. మీరున్న ప్రదేశం వివరాలు తెలియజేయండి తప్పకుండా వారికి సమస్యను పరిష్కరించే విధంగా వివరణ ఇస్తాము అని.. సమాధానం ఇచ్చారు. ఇక రోగికి సంబంధించిన వివరాలను కూడా మెయిల్ చేయడంతో పోలీసుల నుంచి అనుమతి లభించిందని వెంటనే మందులను అవసరమైన వారికి అందించినట్లు నిఖీల్ తెలిపారు.

    English summary
    Tollywood young hero Nikhil has released a video of himself getting emotional for the first time. He explained that he was saddened by the death of human beings before his eyes. Nikhil recently took a break from shooting and got busy with a good job. He also tried to convey a message about the current situation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X