Just In
- 38 min ago
ఆ డైరెక్టర్ రూంకి పిలిచి అక్కడ తాకాడు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ: టాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
- 51 min ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 1 hr ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- 2 hrs ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
Don't Miss!
- News
బిడెన్‌కు అప్పుడే అభిమానులు పుట్టుకొచ్చారు: బాటిల్లో మినియేచర్: ఎవరీ ఈశ్వర్ రావు: గిఫ్ట్‌గా
- Sports
నాకూ కరోనా వచ్చింది.. వైరస్ జోక్ కాదు: సానియా
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరోగా అదృష్టం పరీక్షించుకొంటున్న ప్రముఖ కోరియోగ్రాఫర్.. రాఘవ లారెన్స్ దారిలో..
సినిమా పరిశ్రమలో దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు హీరోలుగా మారడం ప్రేక్షకులకు తెలిసిందే. గతంలో ప్రముఖ కోరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ డ్యాన్స్ డైరెక్టర్‌గా ప్రేక్షకులను మెప్పించి హీరోగా, ఆ తర్వాత డైరెక్టర్‌గా అవతారం ఎత్తారు. రాఘవ లార్సెన్ దారిలో ప్రముఖ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా మారుతున్నారు. ఆ సినిమాకు సంబంధించిన వివరాలు..

దక్షిణాదిలో స్టార్ కొరియోగ్రాఫర్‌గా
దక్షిణాది సినీ పరిశ్రమలో జానీ మాస్టర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ కోరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకొన్నారు. ఆయన డైరెక్షన్ చేసిన డ్యాన్సులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొన్నాయి. అనతికాలంలోనే తెలుగులో స్టార్ హీరోలకు కొరియోగ్రఫి అందించే అవకాశాలను చేజిక్కించుకొన్నారు.

రౌడీ బేబీ, బుట్ట బొమ్మ పాటలకు
2020లో రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించిన పాటలకు కొరియోగ్రఫిని అందించిన డ్యాన్స్ డైరెక్టర్‌గా జానీ మాస్టర్ ఘనతను సాధించారు. రౌడీ బేబీ, బుట్ట బొమ్మ లాంటి పాటలకు జానీ మాస్టర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ పాటలు యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లో రికార్డులను తిరగరాసాయి.

టీవీలో రియాలిటీ షోలకు హోస్ట్‌గా
తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్స్ డైరెక్టర్‌గా రాణిస్తూనే టెలివిజన్‌లో పలు డ్యాన్స్, రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో 150కి పైగా చిత్రాలకు కొరియోగ్రఫిని అందించిన జానీ మాస్టర్ ప్రస్తుతం హీరోగా మరో అవతారంలో కనిపించనున్నారు.

సుజీ విజువల్స్ పతాకంపై రూపొందే చిత్రంలో
సుజీ విజువల్స్ పతాకంపై వెంకట్ రమణ కే నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో జానీ మాస్టర్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురళి రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి వరకు తనదైన శైలిలో హీరోలను, అభిమానులను ఆకట్టుకొన్న జానీ మాస్టర్ హీరోగా కూడా రాణిస్తారని ఆశిద్దాం. బెస్టాఫ్ లక్ జానీ మాస్టర్.