Chiranjeevi vs Balakrishna మూడోసారి చిరంజీవి, బాలకృష్ణ ఫైట్.. బాక్సాఫీస్ షేకవ్వాల్సిందేనా..?
చాలా కామన్ గా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ సినిమాల్లో కానీ అభిమానుల్లో కానీ ఇద్దరు హీరోల నడుమ వార్స్ చూస్తూనే ఉంటాము. అది అభిమానుల మధ్య ఇంకా హీరోల విషయానికి వస్తే బాక్సాఫీస్ పరంగా ఉంటాయి. అలా టాలీవుడ్ లో కొందరి హీరోస్ నడుమ పోటా పోటీ చాలా గట్టి లెవెల్లోనే ఉంటుంది.
సమ ఉజ్జి ఉంటేనే ఏ పోరు అయినా రసవత్తరంగా సాగుతుంది అన్నట్టుగా మన టాలీవుడ్ నుంచి ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఒకేసమయంలో వస్తున్నాయి అంటే ఆ హీట్ మామూలు లెవెల్లో ఉండదు. మరి అలాంటి హీరోలు ఒకరు మెగాస్టార్ చిరంజీవి మరొకరు, నందమూరి నటసింహ బాలకృష్ణల నడుమ అంటే మూవీ లవర్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అభిమానుల్లో ఒక కొత్త ఉత్సుకత నెలకొంటుంది.

కాగా ఈ ఇద్దరు హీరోస్ నడుమ ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో చాలా సార్లు బాక్సాఫీస్ క్లాష్ జరిగింది. ఒకోసారి ఒకోకరు గెలిచారు. అయితే ఇప్పుడు ట్రెండ్ పాతకాలం లా లేనే లేదు. పైగా చిరు మధ్యలో గ్యాప్ కూడా తీసుకున్నారు. ఇలా తీసుకొని వచ్చాక మాత్రం ఈ క్రేజీ కాంబినేషన్ నడుమ రెండు సార్లు బాక్సాఫీస్ క్లాష్ పడింది.
మరి మొదటిసారిగా 2017 లో మెగాస్టార్ 150వ చిత్రం "ఖైదీ 150" కి బాలయ్య కెరీర్ భారీ చిత్రం "గౌతమి పుత్ర శాతకర్ణి" కి క్లాష్ పడింది రెండు మంచి టాక్ అందుకున్నాయి కానీ మెగాస్టార్ సినిమా భారీ వసూళ్లు కొల్లగొట్టింది. ఇక రెండోసారి జస్ట్ గత ఏడాదిలోనే "వాల్తేరు వీరయ్య", "వీరసింహ రెడ్డి" రెండు సినిమాలతో వచ్చారు. ఇక్కడ కూడా చిరుకి ఎదురు లేకుండా పోయింది.

కాగా ఈసారి మళ్ళీ ఇద్దరి మధ్య భారీ క్లాష్ పడబోతోంది అని వినిపిస్తుంది. రానున్న 2025 సంక్రాంతి బరిలో చిరు నటిస్తున్న "విశ్వంభర" సినిమా ఆల్రెడీ తేదీ ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. మరి ఇదే సంక్రాంతి రేస్ లో బాలయ్య నటిస్తున్న 109 సినిమా కూడా రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం మూడోసారి బాలయ్య, చిరు ధాటికి బాక్సాఫీస్ షేక్ అవుతుంది అని చెప్పాలి.
అయితే ఇక్కడ మరిన్ని ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. చిరు అభిమాని అయిన బాబీ బాలయ్య సినిమా చేస్తుంటే గతంలో వచ్చిన 'వీర' అనే టైటిల్ తరహాలోనే మరోసారి బాలయ్య సినిమాకి టైటిల్ ఉంటుంది అని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే గత రెండు సార్లు కూడా నాలు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసాయి. మరి ఈ మూడోసారి కూడా ఇదే రీతిలో బాక్సాఫీస్ ని ఈ రెండు సినిమాలు షేక్ చేస్తాయేమో చూడాలి మరి. ఇంకా బాలయ్య సినిమా సంబంధించి అధికారిక క్లారిటీ విడుదలపై వచ్చేస్తే ఈ బిగ్ స్టార్స్ నడుమ క్లాష్ ఉందో లేదో తెలిసిపోతుంది.


Click it and Unblock the Notifications











