Pawan Kalyan OG: పవన్ కల్యాణ్ కోసం పవర్ ఫుల్ టైటిల్.. ఈ వేటాడే చీతకు పేరేం పెట్టారంటే?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో ఓజీ సినిమా ఒకటి. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మొదటి నుంచి అనుకున్న టైటిల్ ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). ఇది సినిమా వర్కింగ్ టైటిల్. అయితే ఇప్పుడు ఈ సినిమా కోసం మేకర్స్ పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. పవన్ కల్యాణ్ కు సరిపడా టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ఓజీ. ఇక ఈ సినిమాలో వైలెంట్ గ్యాంగ్‍ స్టర్‌ పాత్రలో పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రన్ రాజా రన్, సాహో సినిమాల దర్శకుడు సుజిత్ సింగ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ సినిమాపై భారీ హైప్ తీసుకువచ్చింది.

Power Full Title Registered Hungry Cheetah For Pawan Kalyan They Call Him OG Movie Full Details Here

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మరోవైపు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇంకా సుమారు 30 శాతం వరకు చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. ఇటీవల ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ఓజీ మూవీని ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే 2013లో ఇదే సెప్టెంబర్ 27వ తేదీన అత్తారింటికి దారేది రిలీజ్ అయి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా కూడా ఇదే డేట్ కు రావడంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అని అంటున్నారు.

అయితే ప్రస్తుతానికి ఈ సినిమా వర్కింగ్ టైటిల్ ఓజీ. ఈ చిత్రం విషయంలో మరో టైటిల్ ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. గతంలోనే ఈ చిత్రానికి మరో టైటిల్ ఉంటుంది అని మేకర్స్ కూడా చెప్పుకువచ్చారు. అయితే ఆ టైటిల్ ఓజినే ఓజాస్ గంభీర అంటూ సినిమా వర్గాల్లో టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మరో పవర్ ఫుల్ టైటిల్ ని మేకర్స్ లాక్ చేసినట్టుగా సమాచారం.

పవన్ కల్యాణ్ చిత్రానికి ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు "హంగ్రీ చీతా" ని ఫిక్స్ చేసారని బజ్ వినిపిస్తుంది. అయితే ఇదే లైన్ ఈ చిత్రానికి గాను కంపోజ్ చేసిన థీమ్ సాంగ్ లో పెద్ద హైలైట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు ఆ లైన్ నే మేకర్స్ సినిమా టైటిల్ గా రిజిస్టర్ చేయించారని ప్రచారం సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు తగిన టైటిల్ ఫిక్స్ చేశారని తెలుస్తోంది.

Power Full Title Registered Hungry Cheetah For Pawan Kalyan They Call Him OG Movie Full Details Here

ఓజీ మూవీ విషయానికి వస్తే... పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‍ నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి విలన్‍ గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రసాఖ్ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా... డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X