Pawan Kalyan: కన్నడ స్టార్ హీరోకు క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్.. ఏం జరిగిందంటే?
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు ప్రజాసేవలో రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు తన రెగ్యులర్ సినిమాలను కూడా పూర్తి చేసే పనుల్లో నిమగ్నం అవుతున్నాడు. ముందుగా అనుకున్న ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేసి వచ్చే ఎన్నికల కోసం కూడా సన్నద్ధం అవ్వాలి అని భారీ ప్రణాళికలు కూడా రచిస్తున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ అంటే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా మిగతా భాషల్లో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది.
ఇక కన్నడ ఇండస్ట్రీలో కూడా టాలీవుడ్ పవర్ స్టార్ సినిమాలకు మంచి మార్కెట్ కూడా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ ఇటీవల ఊహించిన విధంగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రకు క్షమాపణలు చెబుతూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగింది అంటే.. పవన్ కళ్యాణ్ ఉపేంద్ర సుదీప్ నటించిన కొత్త సినిమా కబ్జా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ముఖ్యఅతిథిగా రావాల్సి ఉంది.

చిత్ర యూనిట్ ప్రత్యేకంగా ఆహ్వానించగా పవన్ కూడా మొదట రావాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా బిజీ షెడ్యూల్స్ వలన పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా స్టార్ హీరోల ఇద్దరికీ కూడా ఆయన క్షమాపణలు చెబుతున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అంతే కాకుండా చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా పవన్ తన విషెస్ అందిస్తూ.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కూడా కోరుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాతో పాటు వినోదాయ సితం రీమేక్ సినిమాలతో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. అలాగే సుజిత్ OG అనే ప్రాజెక్టు కూడా మొదలు పెట్టాల్సి ఉంది. ఇక మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా పవర్ స్టార్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మొదలుపెట్టబోతున్నాడు. ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే మొదలు కాబోతోంది.


Click it and Unblock the Notifications