పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్.. ట్రెండ్ సెట్ చేసిన ఆ మూవీ రీ రిలీజ్ ఫిక్స్!

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినిమాల్లోకి వచ్చినా.. కెరీర్ ఆరంభంలోనే పెద్ద పెద్ద డైరెక్టర్లతో పని చేసినా.. ఆశించిన రీతిలో విజయాలను అందుకోలేకపోయాడు పవన్ కల్యాణ్. అలాంటిది కరుణాకరణ్ అనే దర్శకుడికి ఛాన్స్ ఇచ్చి 'తొలిప్రేమ' అనే చిత్రం ద్వారా మొట్టమొదటి బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. 1998లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతేకాదు, పవన్ కల్యాణ్‌కు స్టార్‌డమ్‌ను కూడా తెచ్చిపెట్టింది. అందుకే ఇది పవర్ స్టార్ కెరీర్‌లో ప్రత్యేకమైన సినిమాగా చెప్పుకుంటూ ఉంటారు.

పవన్ కల్యాణ్‌ను స్టార్‌గా మార్చిన 'తొలిప్రేమ' సినిమా రీ రిలీజ్ చేయడానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ కనిపిస్తోంది.

Power star Pawan kalyan career best hit tholi prema re release date fix

స్టార్ హీరోల క్లాసిక్ చిత్రాలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. వీటికి ఇప్పుడు కూడా అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. అందులోనూ పవన్ కల్యాణ్ సూపర్ హిట్ మూవీలు 'ఖుషి', 'జల్సా' ఇప్పుడు కూడా విడుదలైన భారీ కలెక్షన్లను వసూలు చేశాయి. దీంతో అతడి అభిమానులు మరిన్ని చిత్రాల కోసం వేచి చూస్తున్నారు.

పవన్ కల్యాణ్ హీరోగా.. కరుణాకరణ్ తెరకెక్కించిన 'తొలిప్రేమ' చిత్రాన్ని 4K టెక్నాలజీకి మార్చి జూన్ 30వ తేదీన ఎంతో గ్రాండ్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ విడుదలై ఈ ఏడాదికి 25 సంవత్సరాలు పూర్తి అవబోతున్నాయి. దీన్ని పురస్కరించుకునే ఈ చిత్రాన్ని మరోసారి థియేటర్లలోకి తీసుకు రాబోతున్నారు. ఇక, ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతోన్నాయి.

Power star Pawan kalyan career best hit tholi prema re release date fix

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా 1998లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరుణాకరణ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి దేవా సంగీతాన్ని అందించారు. వాసుకి, అలీ, వేణు మాధవ్, రవి బాబు వంటి వాళ్లు కీలక పాత్రలు చేశారు. అప్పట్లోనే భారీ కలెక్షన్లతో సెన్సేషన్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఏ మేర రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X