కోర్టు మెట్లు ఎక్కడానికి పవన్ కల్యాణ్ సిద్దం.. ఫ్యాన్స్ కోసం షాకింగ్ నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరించడానికి సినీ జీవితానికి తాత్కాలికంగా దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ మళ్లీ వెండి తెరపైన కనిపించేందుకు సిద్ధమయ్యాడు. వరుస సినిమాలను అంగీకరించి ఫ్యాన్స్‌లో జోష్ రేకెత్తించాడు. అయితే అభిమానుల సంతోషంపై లాక్‌డౌన్ నీళ్లు జల్లింది. ఇక లాక్‌డౌన్ తర్వాత ప్రభుత్వాలు సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో పవన్ కల్యాణ్ షూటింగ్ రెడీ అవుతున్నట్టు యూనిట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక వకీల్ సాబ్ షూటింగ్ వివరాలు ఏమిటంటే..

పవన్ కల్యాణ్‌కు లాక్‌డౌన్ ఎఫెక్ట్
సుమారు రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ సినిమాల్లో నటించేందుకు మొగ్గు చూపారు. హిందీలో విజయవంతమైన పింక్, తమిళంలో సక్సెస్ సాధించిన నెర్కొండ పార్వాయి చిత్రం రీమేక్‌గా రూపొందుతున్న వకీల్ సాబ్‌లో లాయర్ పాత్రతో ముందుకు వచ్చారు. అంతేకాకుండా తన పార్ట్ షూటింగ్‌ను 90 శాతం వరకు చకచకా పూర్తి చేశారు. ఆ తర్వాత కరోనా పరిస్థితుల కారణంగా లాక్ డౌన్ విధించడం సినిమా షూటింగులు వాయిదా పడటంతో 10 శాతం సన్నివేశాల చిత్రీకరణ ఆగిపోయింది.

లాక్‌డౌన్ తర్వాత పవర్ స్టార్
లాక్‌డౌన్ తర్వాత ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతించడంతో వకీల్ సాబ్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సినిమా పూర్తయిన శాతాన్ని బట్టి సినిమాల షూటింగులకు అనుమతించాలని నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఇప్పుడున్న చిత్రాల్లో 90 శాతం పూర్తయిన వకీల్ సాబ్‌కు ముందుగా షూటింగుకు అనుమతించాలని నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

కోర్టు సీన్లను చిత్రీకరించేందుకు
తాజా పరిస్థితులకు అనుగుణంగా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పవన్ కల్యాణ్ సినిమా షూటింగు ఆరంభించేందుకు నిర్మాత దిల్ రాజు నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌పై మిగిలిన కోర్టు సీన్లను చిత్రీకరించేందుకు రెడీ అవుతున్నారు. త్వరలోనే కోర్టు సీన్లను పవర్ స్టార్‌పై చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫ్యాన్స్ కోసం సీన్లు రీషూట్
ఇక ఇంతకు ముందు షూట్ చేసిన కొన్ని సీన్లను కూడా రీషూట్ చేయాలని పవన్ కల్యాణ్ చిత్ర యూనిట్‌కు సూచించినట్టు సమాచారం. ఫ్యాన్స్‌లో జోష్ పెంచడానికి పవన్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలిసింది. దాంతో ఎఫెక్టివ్‌గా రాని సన్నివేశాలను తొలగించి కొత్తగా చిత్రీకరించేందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తున్నది. త్వరలోనే షూటింగు డేట్లు కూడా వెల్లడించే అవకాశం ఉంది.
Recommended Video

లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో తొలి సినిమాగా
ఇక బోనికపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ సినిమాను థియేటర్లలోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతి ఇస్తే, తెలుగు రాష్ట్రాల్లో హాళ్లలోకి వకీల్ సాబ్‌ను పంపాలనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. దాంతో సినిమా హళ్లకు ప్రేక్షకులను రప్పించడానికి ఓ చక్కటి అవకాశంగా ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.


Click it and Unblock the Notifications











