బాలయ్య సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా మరో సీనియర్ హీరో

టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ మొత్తానికి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపాన్ని చూపించాడు. సినిమా 25 రోజుల వరకు బాక్సాఫీసు వద్ద ఒక సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మొత్తానికి మంచి ప్రాఫిట్స్ తో నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక నందమూరి అభిమానులు కూడా బాలయ్యను చాలా రోజుల తర్వాత వారికి నచ్చినట్లుగా చూడడంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక నందమూరి బాలకృష్ణ తర్వాత చేయబోయే సినిమాల పై మరింత ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు ప్రేక్షకులకు నచ్చే విధంగా అన్ని రకాల కథలను చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకునే విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా మొదలయ్యాయి. క్రాక్ సినిమాతో తనేంటో నిరూపించుకున్న దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యను కూడా తనదైన శైలిలో చూపించే స్టార్ దర్శకుడిగా తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాను కూడా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని నిజమైన సంఘటన ఆధారంగా చేసుకొని తెర వైపు తీసుకు వస్తున్నట్లు సమాచారం. తప్పకుండా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు చాలా నమ్మకంతో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు అనేది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Powerful villain in Balakrishna upcoming project

ఇక హీరోయిన్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం కొంతమంది అయితే గట్టిగానే వినిపిస్తునాయి. ఆ సంగతి పక్కన పెడితే సినిమాలో నందమూరి బాలకృష్ణ కు విలన్ గా ఎవరు నటిస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సీనియర్ హీరో అర్జున్ బాలకృష్ణ సినిమాలో విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను చేశాడు.

నా పేరు సూర్య, లై వంటి సినిమాల్లో చాలా పవర్ఫుల్ పాత్రలో కనిపించినప్పటికీ ఆ సినిమాలో పెద్దగా సక్సెస్ అవ్వలేదు. అంతకుముందు కూడా అర్జున్ కొన్ని తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో మెప్పించే ప్రయత్నం చేశాడు. కానీ అవి కూడా అంతగా క్లిక్ అవ్వలేదు. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రాబోయే సినిమాలో నెగటివ్ పాత్రలో పవర్ఫుల్ విలన్ గా కనిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి దర్శకుడు గోపీచంద్ మలినేని అర్జున్ లాంటి సీనియర్ హీరోను ఏ విధంగా ప్రజెంట్ చేస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X