మండుటెండల్లో కష్టపడుతోన్న ప్రభాస్: నలభై రోజుల పాటు అదే పనిలో రెబెల్ స్టార్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'ఆదిపురుష్'. రామాయణంలో ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని కొత్త కథతో వస్తోంది. పాన్ ఇండియా రేంజ్‌తో ఐదు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ భారీ స్థాయిలో రాబోతున్న దీని షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఒకవైపు కరోనా వైరస్ భయం వెంటాడుతోన్నా.. ఈ మూవీ షూటింగ్ మాత్రం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చిత్ర హీరో ప్రభాస్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది.
ప్రశాంత్ నీల్ రూపొందిస్తోన్న 'సలార్' మూవీ కోసం కొన్ని రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్నాడు ప్రభాస్. ఇక, ఈ మధ్య 'ఆదిపురుష్' టీమ్‌తో కలిశాడు. దాదాపు పది రోజులుగా ఈ మూవీ షూటింగ్ ముంబైలోని మధ ద్వీపంలో జరుగుతోంది. కరోనా విజృంభిస్తుండడంతో స్పాట్‌కు కేవలం 24 మంది సభ్యులనే అనుమతించి చిత్రీకరణ జరుపుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం ప్రభాస్ మండుటెండల్లో షూటింగ్‌లో పాల్గొంటున్నాడట. అంతేకాదు.. ఇలా దాదాపు 40 రోజుల పాటు చెమటోడ్చబోతున్నాడని తెలుస్తోంది. ఆ తర్వాత సలార్ షూట్ చేస్తాడని టాక్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 'ఆదిపురుష్' మూవీని టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ రావణుడిగా చేస్తున్నారు. టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











