ట్రెండింగ్ లో ఆదిపురుష్.. కానీ అప్డేట్ ఏది ?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. అయితే నేడు శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఉదయం 7 గంటల 11 నిమిషాలకు ఒక అప్డేట్ వస్తుందని ఒకరోజు ముందు నుంచి ప్రచారం జరిగింది. ఈ దెబ్బకు సోషల్ మీడియాలో ఆదిపురుష్ ట్రేండింగ్ లోకి వచ్చేసింది. అయితే ప్రచారం జరిగినట్లుగా ఎక్కడా ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. అయితే అసలు ఎక్కడా యూనిట్ నుండి ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా ఈ అప్డేట్ వస్తుందని ఎలా ప్రచారం మొదలయిందో తెలియదు.
అయితే శ్రీరామనవమి కావడంతో శ్రీ రాముడుగా ప్రభాస్ ఉన్న లుక్ వస్తుందని అందరూ అంచనాలు వేసుకున్నారు. కానీ అనూహ్యంగా ఎలాంటి అప్డేట్ సినిమా యూనిట్ నుంచి రాకపోవడంతో ప్రభాస్ అభిమానులు ఉసూరుమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అప్డేట్ రాకపోయినా ప్రస్తుతానికి ఈ ఆదిపురుష్ ట్రెండింగ్ లో ఉంది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా నటిస్తున్నారు. ఇక సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలో విడుదల చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది.

ఇక దాదాపు ఈ సినిమాకు సంబంధించి 30 శాతం షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది. సినిమాలో ప్రధాన పాత్రధారులు గత ఏడాదిలోనే ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ పూర్తి చేశారని దర్శకుడు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సైఫ్ అలీ ఖాన్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ చాలా గ్రాండ్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నామని ఈ సీన్స్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలుస్తాయని దర్శకుడు చెబుతున్నారు. అలాగే సాధారణంగా దేవుళ్లకు సంబంధించిన సినిమాలు చేస్తున్న సమయంలో కాంట్రవర్సీలు రావడం సహజం కానీ తాను చాలా గ్రౌండ్ వర్క్ చేసి కాంట్రవర్సీలు తావివ్వకుండా ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నానని దర్శకుడు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











