Adipurush: ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. స్పెషల్ సర్‌ప్రైజ్.. డేట్ ఫిక్స్!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా అనంతరం వరుసగా పాన్ ఇండియా సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ కథలను కాకుండా విభిన్నమైన జానర్స్ లో కూడా ప్రభాస్ సినిమాలను చేస్తూ ఉండడం విశేషం. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఆదిపురుష్ సినిమాపైనే ఉంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ను త్వరలోనే అందించబోతున్నారు. అందుకు సంబంధించిన డేట్ కూడా హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Recommended Video

KGF Chapter 2 Trailer Sensational Record ఇవి బ్రేక్ చేయగలిగేది Prabhas మాత్రమే | Filmibeat Telugu
వంద కోట్ల నష్టం

వంద కోట్ల నష్టం

రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. యువి క్రియేషన్స్ లో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయింది. సినిమా నెగెటివ్ టాక్ ఎక్కువగా రావడంతో రెండు మూడు రోజుల్లోనే కలెక్షన్స్ తగ్గుతూ వచ్చాయి దాదాపు వంద కోట్లకు పైగా సినిమా నష్టపోయినట్లు తెలుస్తోంది.

 స్టార్ క్యాస్ట్ తో ఆదిపురుష్

స్టార్ క్యాస్ట్ తో ఆదిపురుష్

రాధే శ్యామ్ ప్రభావంతో ప్రభాస్ కాస్త అప్సెట్ అయినట్లు కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే తదుపరి సినిమాలతో మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రభాస్ ప్రణాళికలు రచిస్తున్నాడు. ఇక ప్రభాస్ నుంచి తర్వాత రాబోయే చిత్రం ఆది పురుష్ ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్రల్లో కనిపించబోతున్నాడు.

ఫస్ట్ లుక్ టీజర్

ఫస్ట్ లుక్ టీజర్

ఆది పురుష్ సినిమాను పూర్తిగా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోంది. ప్రభాస్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హార్డ్ వర్క్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలైతే గత నెలలోనే సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు రాధే శ్యామ్ హడావిడిలో ఉండగా విడుదల చేయడం మంచిది కాదు అని వాయిదా వేసుకోవలసి వచ్చింది.

 డేట్ ఫిక్స్

డేట్ ఫిక్స్

రాబోయే శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన ప్రభాస్ మొదటి ఫస్ట్ లుక్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాముడి పాత్రలో ప్రభాస్, కృతిసనన్ సీతగా దర్శనమివ్వబోతున్నారట. ఇక ఈ సినిమాపై అంచనాలు కూడా గట్టిగానే పెరుగుతున్నాయి. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 300 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆదిపురుష్ సినిమాను ఇతర దేశాల్లో వివిధ భాషల్లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎంతవరకు పెరుగుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X