Tollywood నెం.1 హీరో ఎవరో తెలుసా?.. అల్లు అర్జున్‌ను వెనక్కు నెట్టిన టాప్ హీరో ఎవరంటే?
తెలుగు హీరోలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పరిచయం అవుతున్నారు. బాహుబలి లాంటి సినిమాతో ప్రభాస్ ప్రపంచంలో చాలా దేశాల్లో అభిమానులను సంపాదించుకోగా ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా మన హీరోలు అందరూ కూడా తమ పరిధి పెంచుకుంటూ ముందుకు వెళుతున్నారు. అయితే ఎవరి దారిలో వారు ముందుకు వెళ్తున్నా సరే టాలీవుడ్ లో ఎవరు నెంబర్ వన్ అంటే ఇప్పుడు ఉన్న అందరి హీరోల అభిమానులు కూడా మా హీరో నెంబర్ వన్ అంటే మా అభిమాన హీరో నెంబర్ వన్ అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇండియాలో మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎవరికీ ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరి గురించి చర్చ జరిగింది అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక లిస్ట్ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ సర్వే మార్చి 2022 నెలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఆ జాబితాలో ప్రభాస్ మొదటి స్థానానికి వచ్చాడు. అలాగే కొందరు హీరోల స్థానాలు మారాయి. ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే

1-ప్రభాస్ 2-అల్లు అర్జున్
పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ కేటగిరీలో ఏడాది పాటు ఏక చక్రాధిపత్యం కొనసాగించిన మహేష్ బాబుని కాదని మొదటి స్థానాన్ని జనవరి, ఫిబ్రవరి నెలలకు గాను అల్లు అర్జున్ వశం చేసుకోగా ఇప్పుడు ఆ స్థానాన్ని ప్రభాస్ దక్కించుకున్నాడు. ఫిబ్రవరిలో రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఈ నెలలో మొదటి స్థానానికి ఎగబాకారు. కొద్ది రోజుల క్రితమే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నారు. ఇక జనవరి ఫిబ్రవరి నెలలో మొదటి స్థానం తెచ్చుకున్న అల్లు అర్జున్ రెండో స్థానానికి చేరాడు. ఇక చివరిగా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటాడు. ఆ సినిమా రెండో భాగం కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.

3-ఎన్టీఆర్ 4- మహేష్ బాబు పవన్ కళ్యాణ్
ఇక ఫిబ్రవరి నెలలో ఐదో స్థానానికి పరిమితమైన ఎన్టీఆర్ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకారు. రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేయగా అది మార్చి నెలలోనే విడుదలయింది. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇక ఆయనకు లభించిన క్రేజ్ కు స్థానం లభించింది. ఈ సినిమా తర్వాత ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. ఇక వరుసగా పన్నెండు నెలలు మొదటి స్థానంలో ఉంటూ వచ్చిన మహేష్ జనవరిలో నాలుగో స్థానానికి పడిపోగా ఫిబ్రవరి నెల కాస్త కోలుకుని మూడో స్థానానికి చేరగా ఇప్పుడు మళ్ళీ ఆయన నాలుగో స్థానానికి దిగజారాడు. చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు పరశురాం దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావలసి ఉండగా మే నెలకు వాయిదా పడింది.

5-ఎన్టీఆర్ 6-రామ్ చరణ్
ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ ఫిబ్రవరి నెలలో నాలుగో స్థానంలో ఉండగా అక్కడి నుంచి ఐదో స్థానానికి దిగజారారు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో పలకరించారు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది కానీ కలెక్షన్స్ లో వెనుక పడింది. ఇక ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఆచార్యలో కూడా ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న రావాల్సి ఉంది కానీ వాయిదా పడి ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

7-నాని 8-విజయ్ దేవరకొండ
ఫిబ్రవరి నెలలో ఏడవ స్థానంలో ఉన్న నేచురల్ స్టార్ నాని ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా శ్యామ్ సింగరాయ్ సినిమాతో డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన అంటే సుందరానికి అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఫిబ్రవరి జాబితాలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో నిలవగా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అది విడుదల కాక ముందే జనగణమన సినిమా మొదలు పెట్టారు.
Recommended Video


9- రవితేజ, 10- చిరంజీవి
ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఆయన సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో హీరోగా నటించారు. అయితే ఆ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అయింది, కానీ మళ్ళీ ఏప్రిల్ 29కి వాయిదా వేశారు. అదొక సినిమా కాకుండా చిరంజీవి మరో నాలుగు సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. ఇక ఈ జాబితాలో రవితేజ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











