twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూవీ క్రియేషన్స్ కోసం ప్రభాస్ జెట్ స్పీడ్ ప్లాన్.. మరో వారం రోజుల్లో కొత్త ప్రాజెక్ట్.. డేట్ ఫిక్స్?

    |

    రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల రాధే శ్యామ్ సినిమాతో ఊహించని విధంగా బిగ్గెస్ట్ డిజాస్టర్ ను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత అంచనాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా అదే స్థాయిలో సక్సెస్ అందుకోవాలనే ప్రభాస్ వరుసగా రెండు సినిమాలు యు.వి.క్రియేషన్స్ లోనే చేశాడు. సాహో సినిమా ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఆ తర్వాత వచ్చిన రాధే శ్యామ్ సినిమా మాత్రం కొంచెం కూడా ఆకట్టుకోలేకపోయింది. అంతే కాకుండా ఈ సినిమా ఆర్థికంగా కూడా చిత్ర నిర్మాతల ను కోలుకోలేని దెబ్బ కొట్టింది. భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన రాధే శ్యామ్ సినిమా దాదాపు వంద కోట్ల వరకు నష్టం కలిగించినట్లు సమాచారం. ప్రభాస్ కెరీర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.

    ఇక ప్రభాస్ తన తదుపరి సినిమాలతో మంచి విజయాన్ని అందుకోవాలని ఆలోచిస్తున్నాడు. ముఖ్యంగా యూవి క్రియేషన్స్ మరో సక్సెస్ ఇచ్చి ట్రాక్ లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను ఎప్పుడు మొదలు పెడతారు ఎలా స్టార్ట్ చేస్తారు అనే విషయంలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సెట్ ను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది.

    Prabhas and director maruthi project launch date details,

    ఇక సినిమాను ఏప్రిల్ 10వ తేదీన లాంచ్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇక ప్రభాస్ సలార్ కు సంబంధించిన మరొక ముఖ్యమైన షెడ్యుల్ ను పూర్తి చేసుకోగానే మారుతి సినిమా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కేవలం రెండు నుంచి మూడు నెలల మధ్య లోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రభాస్ పూర్తిచేసే అవకాశం ఉందట. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నట్లు అప్పట్లో వినిపించింది.

    అయితే ఆ టైటిల్ అంతగా ప్రభాస్ రేంజ్ కు సెట్ అవ్వదు అని అభిమానుల నుంచి భారీ స్థాయిలో డిమాండ్ రావడంతో చిత్ర నిర్మాణ సంస్థ ఆ టైటిల్ మార్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు యు.వి.క్రియేషన్స్ కోసం ప్రభాస్ కొరటాల శివను కూడా లైన్ లో పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో ఇదివరకే మిర్చి సినిమా చేసిన ప్రభాస్ మళ్లీ అదే దర్శకుడితో యు.వి.క్రియేషన్స్ తో కలిసి ఒక యాక్షన్ సినిమా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు టాక్. ప్రభాస్ లిస్ట్ లో ఉన్న ప్రస్తుత ప్రాజెక్టులు ఆదిపురుష్, సలార్ సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ప్రాజెక్ట్ K అలాగే స్పీరిట్ సినిమాలు కూడా ఆ తర్వాత భారీ స్థాయిలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.

    English summary
    Prabhas and director maruthi project launch date details,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X