టాలీవుడ్ నెం.1గా ప్రభాస్.. ఎన్టీఆర్ ను వెనక్కు నెట్టి మహేష్ బాబు హవా!
తెలుగులో నెంబర్ వన్ ఎవరంటే ఎవరికైనా ఠక్కున చెప్పడం కష్టమే. అందుకే మోస్ట్ పాపులర్ సర్వే కంపెనీ ఆర్మాక్స్ మీడియా ప్రతి నెల మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ సర్వే నిర్వహిస్తోంది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎవరికీ ఎక్కువ క్రేజ్ ఉంది? ఎవరి గురించి చర్చ జరిగింది అనే అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక లిస్ట్ విడుదల చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ సర్వే మే 2022 నెలకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ఆ జాబితాలో ఎన్టీఆర్ ను వెనక్కు నెట్టి ప్రభాస్ మొదటి స్థానానికి వచ్చాడు. అలాగే కొందరు హీరోల స్థానాలు మారాయి. ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే

1-ప్రభాస్ 2-మహేష్ బాబు
ఈ లిస్టులో ఇక మార్చి నెలలో ఒకటో స్థానంలో ఉన్న ప్రభాస్ ఏప్రిల్ నెలలో రెండో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే ఎలాంటి సినిమా రిలీజ్ లేకున్నా ఆయన మళ్ళీ ఫస్ట్ ప్లేస్ కు అచ్చాడు. కొద్ది రోజుల క్రితమే రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో కాస్త ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, సలార్, స్పిరిట్ వంటి సినిమాలతో ప్రభాస్ బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఏప్రిల్ లో ఐదో స్థానానికి పరిమితం అయిన మహేష్ ఇప్పుడు ఏకంగా రెండో స్థానానికి వచ్చి చేరాడు. చివరిగా సర్కారు వారి పాట అనే సినిమాతో ఆయన ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమా పూర్తయింది కాబట్టి ఆయన త్రివిక్రమ్ తో కలిసి సినిమా చేయనున్నారు.

3-ఎన్టీఆర్ 4- అల్లు అర్జున్
మార్చిలో మూడో స్థానంలో ఉన్న ఎన్టీఆర్ ఏప్రిల్ నెలలో మొదటి స్థానానికి ఎగబాకారు. ఇప్పుడు ఆయన మూడో స్థానానికి వచ్చి చేరారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా చేయగా అది మార్చి నెలలో విడుదలైంది. ఈ సినిమాలో ఆయన రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నారు. ఏప్రిల్ లో మూడో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ మే నెలలో మాత్రం నాలుగో స్థానానికి చేరారు. ఇక చివరిగా పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ సూపర్ హిట్ అందుకున్నాడు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సత్తా చాటాడు.

5-రామ్ చరణ్ 6-పవన్ కళ్యాణ్
ఇక రామ్ చరణ్ గత నెలలో నాలుగో స్థానంలో ఉండగా ఈసారి ఐదవ స్థానానికి దిగజారారు. రాజమౌళి దర్శకత్వంలో RRR అనే సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాలో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే కొరటాల శివ చిరంజీవిల ఆచార్యలో కూడా ఆయన నటించగా ఆ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. వరుసగా పన్నెండు నెలలు మొదటి స్థానంలో ఉంటూ వచ్చిన మహేష్ జనవరిలో నాలుగో స్థానానికి పడిపోగా ఈ సారి ఏకంగా ఐదో స్థానానికి దిగజారాడు. ఇక ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ ఏప్రిల్ నెలలో ఆరో స్థానాల్లో ఉండగా అదే స్థానాన్ని నిలబెట్టుకున్నారు. వకీల్ సాబ్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన చివరిగా భీమ్లా నాయక్ సినిమాతో పలకరించారు. ఇక ఆయన క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాలు చేస్తున్నారు.

7-నాని 8-విజయ్ దేవరకొండ
ఏప్రిల్ నెలలో ఏడవ స్థానంలో ఉన్న నేచురల్ స్టార్ నాని ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా అంటే సుందరానికి అనే సినిమాతో జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన వరుస సినిమాలు లైన్లో ఉన్నాయి. ఏప్రిల్ నెలలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఎనిమిదో స్థానంలో నిలవగా ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఇప్పుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అది విడుదల కాకముందే జనగణమన సినిమా మొదలు పెట్టారు. అలాగే శివ నిర్వాణ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారు.
Recommended Video


9-చిరంజీవి , 10- రవితేజ
ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ జాబితాలో తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. చివరిగా ఆయన ఆచార్య అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా కాకుండా చిరంజీవి మరో నాలుగు సినిమాలు కూడా లైన్ లో పెట్టారు. ఇక ఈ నెలలో రవితేజ కూడా తన స్థానాన్నిమళ్ళీ నిలబెట్టుకున్నారు. చివరిగా ఖిలాడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











