ఇప్పటి వరకూ చూడని రొమాంటిక్ యాంగిల్‌లో ప్రభాస్.. హీరోయిన్‌తో ఓ రేంజ్ రొమాన్స్.!

By Manoj

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో బాగా పేమస్. తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ హీరో దేశ వ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాజమౌళి తీసిన 'బాహుబలి'తోనే ఇది సాధ్యమైంది. దీనికితోడు హ్యాండ్సమ్‌గా కనిపించే ఈ ఆరడుగుల హీరోకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే ప్రభాస్ ఏది చేసినా సంచలనమే అవుతోంది. ఈ క్రమంలోనే అతడు చేస్తున్న సినిమాలు సైతం విపరీతంగా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. తాజాగా ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతోంది.

హిట్ కాకున్నా కలెక్షన్లు మాత్రం వచ్చాయి

హిట్ కాకున్నా కలెక్షన్లు మాత్రం వచ్చాయి

‘బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన చిత్రం ‘సాహో'. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమాకు దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ అయింది. దీంతో సినిమాపై ఆది నుంచీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఊహించని విధంగా ఈ సినిమా నిరాశను, నష్టాలను మిగిల్చింది. అయితే, హిందీలో మాత్రం ప్రభాస్ దుమ్ము దులిపేశాడు. అక్కడ టాక్‌తో పాటు కలెక్షన్లూ వచ్చాయి.

 ప్రభాస్‌లోని సరికొత్త కోణం చూపిస్తారట

ప్రభాస్‌లోని సరికొత్త కోణం చూపిస్తారట

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘సాహో' తర్వాత ప్రభాస్ ‘జాన్' (వర్కింగ్ టైటిల్) అనే సినిమాలో నటిస్తున్నాడు. 1960వ దశకం నాటి కథతో వస్తున్న ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పిరియాడిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఇందులో ప్రభాస్‌ను లవర్ బాయ్‌గా చూపించబోతున్నారు.

గ్యాప్ ఇచ్చినా.. ఫ్యాన్స్‌ను మెప్పించాడు

గ్యాప్ ఇచ్చినా.. ఫ్యాన్స్‌ను మెప్పించాడు

ఈ సినిమా ‘సాహో'కు ముందే ప్రారంభం అయింది. అప్పుడు యూరప్‌లో కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించిన తర్వాత ఆగిపోయింది. అయితే, ఇటీవల మరోసారి షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన వెంటనే ప్రభాస్ గ్యాప్ తీసుకున్నాడు. దీంతో అతడిపై విమర్శలు వచ్చాయి. కానీ, స్లిమ్‌గా తయారై కనిపించడంతో ఫ్యాన్స్‌తో సహా అందరూ అవాక్కయ్యారు.

ప్రభాస్ సినిమా అంటే ఈ రేంజ్ ఉంటుంది

ప్రభాస్ సినిమా అంటే ఈ రేంజ్ ఉంటుంది

టాలీవుడ్‌లోనే స్టార్ హీరో.. అందునా దేశ వ్యాప్తంగా పరిచయం ఉన్న వాడు కావడంతో ‘జాన్'పై అప్పుడే ఆసక్తి పెరిగిపోతోంది. దీనికి కారణం ఈ సినిమా గురించి కొద్ది రోజులుగా వస్తున్న వార్తలే. ఇందులో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని, అది కూడా తండ్రి కొడుకులుగా అని అంటున్నారు. అలాగే, ఇది పూర్వ జన్మల కథతో రూపొందుతోందని కూడా ప్రచారం చేస్తున్నారు.

Recommended Video

Prabhas Rare Video || Prabhas With Family On Krishnam Raju Birthday
హీరోయిన్‌తో యంగ్ రెబెల్ స్టార్ ఓ రేంజ్ రొమాన్స్.!

హీరోయిన్‌తో యంగ్ రెబెల్ స్టార్ ఓ రేంజ్ రొమాన్స్.!

తాజాగా ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇందులో ప్రభాస్ - హీరోయిన్ పూజా హెగ్డే మధ్య రొమాన్స్ ఓ రేంజ్‌లో ఉంటుందట. ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో చూపించని విధంగా ఇందులో చూపించబోతున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ మూవీలో లిప్ కిస్‌లు ఐదారు ఉంటాయని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X