యంగ్ హీరోయిన్ కి స్పెషల్ ట్రిట్ ఇచ్చిన ప్రభాస్‌.. డార్లింగ్ గురించి తెలిసిందేగా..

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాలర్, కల్కి 2898 ఏడీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డార్లింగ్ పుల్ జోష్ లో ఉన్నారు. అతి త్వరలోనే 'రాజాసాబ్' అనే కామెడీ హర్రర్ మూవీతో ప్రేక్షకులు ముందుకు రానున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి అయింది. దీంతో హను రాఘపూడి డైరెక్షన్ తో తెరకెక్కుతున్న 'ఫౌజీ' షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ గురించి హీరోయిన్ ఇమాన్వీ ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసింది. ఇంతకీ ఏమన్నారంటే ?

డార్లింగ్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ.. బ్యాక్‌ టు బ్యాక్‌ సక్సెస్ ను అందుకుంటున్నారు ప్రభాస్. డార్లింగ్ సినిమా లైన్ అప్ చూస్తే.. కళ్ళు బైర్లు కమ్మల్సిందే. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకు వెళ్తున్న ప్రభాస్.. ప్రస్తుతం హను రాఘవపూడి డైరెక్షన్​ లో తెరకెక్కుతున్న 'ఫౌజీ ' మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతుంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా షూటింగ్‌లో పాల్గొన్న ప్రభాస్ మరో రెండు వారాల పాటు షూటింగ్‌ పాల్గొన్నబోతున్నారు. సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి అవుతాయని తెలుస్తోంది.

Prabhas Arranged home made food For heroine Imanvi In Fauji Set video viral

ఇదిలాఉంటే.. డార్లింగ్ ప్రభాస్‌ భోజన ప్రియుడనే విషయం అందరికీ తెలిసిందే. తన సినిమా ఏదైనా.. ఆ మూవీ సెట్స్‌లోని వారందరికి తన ఇంటి నుంచి భోజనం వచ్చేస్తుంది. వెజ్, నాన్ వెజ్ తో పాటు భీమవరం స్పెషల్స్‌ ఉండాల్సిందే. ఇలా ప్రభాస్ తన ఇంటి నుంచి చికెన్‌, చేపలు, మటన్‌కి సంబంధించి పలు వెరైటీలతో గ్రాండ్ గా మీల్స్ ఆరెంజ్ చేస్తారు. తాజాగా.. ఈ డార్లింగ్‌ తన కొత్త సినిమా హీరోయిన్‌కి ఆతిథ్యం ఇచ్చాడు. ఆ అమ్మడు ఊహించిన విధంగా తన ఇంటికి క్యారేజ్‌ పంపించాడట. ఈ విషయాన్ని ఆముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వెల్లడించింది.

ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. హీరోయిన్ ఇమాన్ ఇస్మాయిల్. ప్రభాస్‌-హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడిగా ఇమాన్ ఇస్మాయిల్ అనే ఢిల్లి బ్యూటీ నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ కోసం డార్లింగ్ ప్రభాస్ తన ఇంటి నుంచి చికెన్‌, చేపలు, మటన్‌కి సంబంధించి పలు వెరైటీలతో గ్రాండ్ గా క్యారేజ్‌ పంపించాడట. ఈ విషయాన్ని చెబుతూ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ వీడియో షేర్‌ చేసింది. ప్రభాస్‌ పంపిన విందును వీడియో తీసి ఆ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది.

Prabhas Arranged home made food For heroine Imanvi In Fauji Set video viral

డార్లింగ్ ఆతిథ్యాన్ని మెప్పించి ముద్దుగుమ్మ ప్రభాస్‌ థ్యాంక్స్‌ చెబుతూ పోస్ట్ పెట్టింది. ప్రభాస్ పంపించిన భోజనం చాలా బాగుంది అంటూ చెప్పుకొచ్చింది. కొత్త హీరోయిన్లకు సైతం ప్రభాస్ ఆతిథ్యం ఇవ్వడం ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. ఇదెలా ఉంటే.. 'సీతారామం'తో సక్సెస్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడి ఫౌజీ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Read more about: prabhas fauji
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X