ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే? ప్రభాస్‌, అల్లు అర్జున్, రామ్‌ చరణ్‌ లు ఏయే స్థానాల్లో ఉన్నారంటే ?

India's Most Popular Male Film Stars: మన దేశంలో సినిమాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ సినిమాలలో నటించే యాక్టర్స్ ను ఎంతగానో అభిమానిస్తారు. ఆ హీరోలను వారిని దేవుళ్లలాగా కొలుస్తారు. ఇక తమ నటుడి సినిమా విడుదలయితే చాలు.. థియేటర్లలో జాతర చేస్తారు. పునకాలతో ఊగిపోతారు. ఇలా ఎంతోమంది స్టార్స్ తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అలా ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరో ఎవరనేది ప్రకటించింది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ గల యాక్టర్స్ జాబితాను ( డిసెంబర్)ప్రముఖ మీడియా సంస్థ 'ORMAX' విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం ఇండియాలో మోస్ట్ పాపులర్ మేల్ యాక్టర్‌ ఎవరు? అలాగే ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న టాప్ టెన్ హీరోలెవరు? అనేది ఓ లూక్కెయ్యండి.

తాజాగా ప్రముఖ మీడియా కన్సల్టింగ్‌ సంస్థ ఓర్మాక్స్‌ మీడియా'(Ormax Media)డిసెంబర్ 2024 సర్వే రిపోర్టును విడుదల చేసింది. ఈ సంస్థ తన సర్వేలో ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్‌ టాప్ 10 లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ఐదురుగు టాలీవుడ్ హీరో చోటు దక్కించుకోగా.. ముగ్గురు బాలీవుడ్, మరో ఇద్దరు కోలీవుడ్ హీరోలు చోటు సంపాందించుకున్నారు. ఓర్మాక్స్‌ మీడియాలిస్ట్‌ ప్రకారం ఇండియా మోస్ట్ పాపులర్ స్టార్ గా యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ (Prabhas)మొదటి స్థానంలో నిలిచారు.

Prabhas Becomes India s Most Popular Male Film Star in Ormax media servey December 2024 allu arjun ram charan follow

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. గతేడాది విడుదల 'కల్కి' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో డార్లింగ్ క్రేజ్ మరింత పెరిగింది. మరో సారి తన సత్తా ఏంటో చూపించారు. దీంతో ప్రభాస్ కు వరుసగా పాన్ ఇండియా సినిమాల ఆఫర్ వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ చేతిలో మూడు సినిమాలు ఉండగా.. మరో మూడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా ప్రభాస్ పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దీంతో ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.

ఇక రెండో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు. పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన పుష్ప 2 సినిమా ఇలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించి, నయా రికార్డులను క్రియేట్ చేసింది అల్లు అర్జున్ పుష్ప 2. ఈ సినిమా ఏకంగా 1900 కోట్లను వసూలు చేసింది అంటే మామూలు విషయం కాదు. అందులో దాదాపు 900 కోట్లు నార్త్ లోనే వసూలు చేసిందంటే అల్లు అర్జున్ క్రేజ్ అండ్ పాపులాటి ఏంటో ప్రత్యేకంగా చెప్పావల్సిన అవసరం లేదు.

ఇక మూడవ స్థానంలో కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ నిలిచారు. ఈ ఏడాది తన చివరి సినిమా సినిమా చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక నాలుగో స్థానంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నిలిచారు. ఇక ఐదవ స్థానంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నిలవగా.. ఆరో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చోటు సంపాదించుకున్నారు. ఇక సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఏడవ స్థానంలో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 8వ స్థానంలో నిలిచారు. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తొమ్మిదో స్థానంలో, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 10వ స్థానంలో నిలిచారు.

More from Filmibeat

Read more about: ormax media prabhas allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X