ఎన్టీఆర్ అభిమాని మృతితో ప్రభాస్ కీలక నిర్ణయం.. అందుకే ఇలా..
రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల కాలంలో ఎక్కువగా జనాలకు కనిపియించింది లేదు. రాధే శ్యామ్ సినిమా డిజాస్టర్ అనంతరం విదేశాలకు వెళ్లి అక్కడే కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్నాడు. అలాగే మోకాలి సర్జరీ కారణంగా కూడా విదేశాల్లోనే ఉండాల్సి వచ్చింది. ఇక ఇండియాకు తిరిగి రాగానే ప్రభాస్ వెంటనే లైనప్ లో ఉన్న బిగ్ ప్రాజెక్ట్ లను రీ స్టార్ట్ చేశాడు. రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటు మరోవైపు కొత్త తరహా కథలను వినే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో ప్రభాస్ చాలా కాలం తరువాత ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్ కు రాబోతున్నాడు.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సీతారామం సినిమా ఆగస్టు 5న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా నేడు జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఒక విధంగా మొదటి సారి ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వస్తున్న కూడా అభిమానులు రావడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే చిత్ర యూనిట్ సభ్యులు ఈ వేడుకకు అభిమానులను రానివ్వడం లేదు.

కనీసం వేడుక కూడా ఏక్కడ జరుగుతుందో తెలియకుండా ప్రైవసీగా నిర్వహిస్తున్నారు. కేవలం కొంతమంది మీడియా ప్రముఖులను మాత్రమే ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. అయితే ప్రభాస్ ఆలోచన ప్రకారం ఈ విధంగా నిర్మాతలు ప్రైవసీగానే వేడుకను నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల బింబిసారా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నందమూరి కి చెందిన ఒక అభిమాని మృతి చెందిన విషయం తెలిసిందే.
కారణాలు ఏవైనా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఫ్యాన్ మృతి చెందడంతో ఒక్కసారిగా అగ్ర హీరోలు వారి ప్రణాళికలను మార్చుకుంటున్నారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రభాస్ వస్తూ ఉన్నాడు కాబట్టి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా అభిమానులు తాకిడి లేకుండా ఈవెంట్ ను నిర్వహించాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ ఈవెంట్లో ప్రభాస్ ఏ విధంగా మాట్లాడుతాడో చూడాలి.


Click it and Unblock the Notifications











