ప్రభాస్ స్టామినా అంటే అదే.. నేషనల్ వైడ్ టాప్ ట్రెండింగ్
బాహుబలి సినిమాలతో ఓ రేంజ్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్.. సాహో సినిమాతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కేవలం తన భుజాలపైనే సాహో చిత్రాన్ని మోసి దాదాపు 300కోట్లను రాబట్ట గలిగాడు. దేశం నలుమూలల నుంచి ప్రభాస్ అభిమానులు సాహో కోసం ఎదురుచూశారు.

ప్రస్తుతం లండన్‌లో..
బాహుబలి సినిమాకు సంబంధించిన లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్‌ను లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఓ అంతర్జాతీయ వేదికపై లైవ్‌లో మ్యూజిక్ ప్లే చేయడంతో వీక్షకులు మంత్రముగ్గులు అయ్యారు. ప్రపంచంలోని నలుమూలల నుంచి బాహుబలి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుష్క, ప్రభాస్, రానా, రాజమౌళి, కీరవాణి అక్కడికి చేరకున్నారు.

జాన్‌తో బిజీ...
అక్కడి నుంచి తిరిగివచ్చాక ప్రభాస్ జాన్ మూవీతో బిజీ కానున్నాడు. ఇప్పటికే కొంత భాగాన్ని షూట్ చేసిన ఈ సినిమాలో ప్రభాస్ అమర ప్రేమికుడుగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.

దేశ వ్యాప్తంగా ట్రెండ్...
రేపు (అక్టోబర్ 23) ప్రభాస్ డార్లింగ్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హవా షురూ అయింది. #HAPPYBIRTHDAYPRABHAS అనే హ్యాష్ ట్యాగ్ క్షణాల్లోనే వైరల్ అయింది. జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లోకి రావడం పట్ల ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ప్రభాస్ తన పుట్టిన రోజును ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











