Prabhas Birthday: సలార్ సర్‌ప్రైజ్ అదిరింది.. ఇది కదా కావాల్సింది.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ K కంటే బెటర్!
రెబల్ స్టార్ ప్రభాస్ 43 వ వసంతంలోకి అడుగు పెట్టాడు. ఇక అతన్ని పుట్టినరోజు సందర్భంగా ఇంతమంది సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు. ఇక ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఒకవైపు బిల్లా కు సంబంధించిన స్పెషల్ షోలు కూడా కొనసాగుతున్నాయి. అలాగే ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదలయ్యాయి. అయితే అందరికీ ఎక్కువగా నచ్చింది మాత్రం సలార్ కు సంబంధించిన సర్‌ప్రైజ్ అని అర్ధమవుతోంది. ఆ వివరాల్లోకి వెళ్ళితే...

హయ్యెస్ట్ రెమ్యునరేషన్
రెబల్ స్టార్ ప్రభాస్ ఎలాంటి సినిమా చేసిన కూడా ఇటీవల కాలంలో ఫ్యాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్న విషయం తెలిసిందే. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక అతను ప్రస్తుతం అందరికంటే ఎక్కువ స్థాయిలోనే పారితోషికం కూడా అందుకుంటున్నాడు. ఒక్కో సినిమాకు ప్రభాస్ ఇప్పుడు 130 కోట్ల నుంచి 150 కోట్ల మధ్యలో ఛార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఆదిపురుష్ లుక్
ఇక భవిష్యత్తులో ప్రభాస్ నుంచి మరిన్ని పెద్ద సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. ఇక నేడు ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాబోయే సినిమాలకు సంబంధించిన స్పెషల్ పోస్టర్స్ అయితే వచ్చాయి. ముందుగా 2023 మొదట్లో రాబోతున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. రామాయణం కథ ఆధారంగా తెరపైకి రాబోతున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆ లుక్ అంచనాలకు తగ్గట్లుగా లేదని కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.

ప్రాజెక్ట్ K హ్యాండ్.. అప్సెట్
ఇక ప్రాజెక్ట్ కె కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ కూడా విడుదల చేశారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సైన్స్ ఫిక్షన్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఆ పోస్టర్లో ప్రభాస్ లుక్ చూపించకుండా కేవలం ఒక ఐరన్ మాన్ తరహాలో ఉండే హ్యాండ్ మాత్రమే చూపించారు. దీంతో ఫాన్స్ అయితే ఆ విషయంలో కొంత అప్సెట్ అయ్యారు. ప్రభాస్ లుక్ ఏదైనా విడుదల చేస్తే బాగుండేది అని కూడా ఉన్నారు.

సలార్ స్పెషల్ లుక్
ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న సలార్ సినిమాపై అయితే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తప్పకుండా అతను మాత్రమే ప్రభాస్ ను ఫ్యాన్స్ కు నచ్చినట్లుగా చూపిస్తాడు అని నమ్మకంతో ఉన్నారు. ఇక అనుకున్నట్లే ఒక స్పెషల్ లుక్ విడుదల చేశారు. అందులో ప్రభాస్ మాసిపోయిన బట్టలతో ఒక మెకానిక్ గా కనిపిస్తున్నాడు. ఈరోజు వచ్చిన అప్డేట్స్ లలో ఇది మాత్రమే చాలా బాగుంది అని కూడా ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందించారు.

ప్రపంచ ఆకర్షణను సాధించాడు.
సలార్ టీం ప్రభాస్ కి బర్త్ డే విషెస్ కూడా అందించింది. అపారమైన పెద్ద కలలు కన్న వ్యక్తి.. భాష, సంస్కృతి సినిమాల సరిహద్దులను దాటి ప్రపంచ ఆకర్షణను సాధించాడు. అసమానమైన ఫాలోయింగ్ ఉన్న వ్యక్తికి దీర్ఘాయువు, విజయాలు అందాలని కోరుకుంటున్నట్లు సలార్ టీమ్.. ప్రభాస్‌కి హృదయపూర్వక హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది.


Click it and Unblock the Notifications











